Deepika padukone react on divorce rumours: బాలీవుడ్ స్టార్ కపుల్ రణ్‌వీర్ సింగ్, దీపికా పదుకొనే విడాకులు తీసుకోబోతున్నారట.. అనే వార్త గత కొన్నిరోజుల నుంచి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పదేళ్లు ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంట మధ్య గత కొంతకాలంగా విభేదాలు నడుస్తున్నాయని, త్వరలోనే ఈ జంట విడాకులు తీసుకోబోతుందని ఉమైర్ సంధు అనే వ్యక్తి ట్వీట్ చేయడం నెట్టింట హాట్ టాపిక్ గా మారింది. ఇక ఈ వార్తలపై రణ్‌వీర్ సింగ్ స్పదించాడు. ఒక ఇంటర్వ్యూలో రణ్‌వీర్ సింగ్ మాట్లాడుతూ ఈ విడాకుల వార్తలను ఖండించాడు. తామిద్దరూ 2012 లో కలుసుకున్నామని, అప్పటినుంచి ప్రేమించుకొని పెళ్లి చేసుకున్నామని, ఈ పదేళ్లలో దీపికాపై ఉన్న ప్రేమ పెరిగిందే కానీ తరగలేదని చెప్పుకొచ్చాడు. మా మధ్య విబేధాలు లేవని, తాము ఇద్దరం ప్రస్తుతం సినిమాల్లో బిజీగా ఉన్నామని చెప్పాడు. అంతేకాకుండా త్వరలోనే మా నుంచి మీకొక గుడ్ న్యూస్ రాబోతుందని, తమని మళ్లీ జంటగా చూడబోతున్నట్లు చెప్పుకొచ్చాడు. అయినా ఆ రూమర్స్ ఆగడం లేదు.
Read also: Assam CM: అస్సాం ముఖ్యమంత్రికి ‘జెడ్ ప్లస్’ సెక్యూరిటీ.. అందుకేనా?
బాలీవుడ్ స్టార్ కపుల్ దీపికా పదుకొనె రణ్వీర్ సింగ్ లు విడాకులు తీసుకోనున్నారంటూ జరుగుతున్న ప్రచారంపై దీపిక స్పందించింది. ‘మా మధ్య ఎలాంటి గొడవలు లేవు. ‘మేం చాలా హ్యాపీగా ఉన్నాం. గత వారం రణ్వీర్ ఓ మ్యూజిక్ ఫెస్టివల్లో భాగంగా ఇంటికి దూరంగా ఉన్నాడు. తిరిగి రాగానే నన్ను చూసి పట్టలేనంత ఆనందం చూపించాడు’ అని ఓ విలేకరి ప్రశ్నకు బదులిస్తూ పరోక్షంగా రూమర్స్ ని పటాపంచల్ చేసింది ఈ బాలీవుడ్ బ్యూటీ. ఇప్పుడు ఈ వీడియో ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది. అభిమానులు ఈ వీడియో క్లిప్‌ను షేర్ చేస్తూ తమపై వస్తున్న పుకార్లకు ఫుల్ స్టాప్ పెట్టాలని కోరుతున్నారు.
ఈ జంట ఇటీవల ముంబైలోని అలీబాగ్‌లోని బీచ్‌కు సమీపంలో ఒక ఇంటిని కొనుగోలు చేసింది. గృహ ప్రవేశం కూడా జరిగింది. ఈ సందర్భంగా చేసిన పూజ కార్యక్రమాలకు సంబంధించిన ఫోటోలను రణవీర్ సింగ్ షేర్ చేసిన సంగతి తెలిసిందే. ఈ భవనం దాదాపు రెండున్నర ఎకరాల్లో విస్తరించి ఉంది. ఇల్లు 18 వేల చదరపు అడుగులు. ఇందులో ఐదు పడక గదులు ఉన్నాయి. దీని విలువ రూ.22 కోట్లు అని తెలిసింది. ప్రస్తుతం ఈ క్రేజీ కపుల్ ముంబైలోని ప్రభాదేవి ప్రాంతంలో నివాసం ఉంటున్నారు. దీపికా పదుకొణె ప్రస్తుతం తెలుగులో ఎంట్రీ ఇస్తూ.. ప్రభాస్‌తో పాన్ ఇండియా మూవీ ప్రాజెక్ట్ కెలో నటిస్తుంది. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇది కాకుండా హిందీలో “పఠాన్`, “జవాన్` చిత్రాల్లో నటిస్తుంది. మరోవైపు రణ్‌వీర్ సింగ్ “సర్కస్`, “రాకీ ఔర్ రాణికి ప్రేమ్ కహానీ` చిత్రాల్లో నటిస్తున్నారు. “సర్కస్`లో దీపిక అతిథి పాత్రలో నటిస్తోంది.
Amaravati Padayatra: నిడదవోలులో ఉద్రిక్తత.. జేఏసీ వర్సెస్ రైతులు