బాలీవుడ్ స్టార్ హీరోయిన్లో దీపికా పడుకొనే ఒకరు. అందం, అభినయంతో స్టార్ హీరోలందరి సరసన నటించి మెప్పించిన ఈ బ్యూటీ అభిమానుల నుంచి ఇంకా సానుభూతి కోరుకుంటుంది. ఒకప్పుడు హీరోయిన్లు తాముఎన్నో కష్టాలను అనుభవించి ఈ స్థాయికి వచ్చామని, తమను ఎంతోమంది అవమానించారని చెప్పేవారు. దీంతో ప్రజలు అయ్యో అంటూ సానుభూతి చూపించేవారు. ప్రస్తుతం అలంటి సానుభూతే కావాలంటుంది దీపికా. ఇటీవల ఆమె కొన్ని ఫోటోలను షేర్ చేసింది. ఆ ఫోటోలలో దీపికా హాట్ గా ఎంతో అందంగా కనిపించింది. కానీ క్యాప్షన్ మాత్రం సానుభూతి కావాలని కోరుకుంటున్నట్లు ఉండేడంతో నెటిజన్స్ అమ్మడిపై విరుచుకుపడ్డారు.
” నేను ఎన్నో కష్టాలను అనుభవించాను.. నన్ను ఇబ్బంది పెట్టిన వారు చాలా మంది ఉన్నారు.. వాటన్నింటిని దాటుకొని ముందుకొస్తున్నాను” అని అర్ధం వచ్చేలా దీపికా పోస్ట్ పెట్టడం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. ఇండస్ట్రీలో అడుగు పెట్టి ఇన్నాళ్లు అయినా కూడా ఇంకా ఎందుకు ఏడుపు అని కొందరు.. ఇప్పుడు నువ్వొక స్టార్ హీరోయిన్ వి.. ఒక స్టార్ హీరోకు భార్యవు.. కానీ ఇంకా ప్రజల నుంచి సానుభూతి కోరుకుంటున్నావా..? అయినా నిజం చెప్పాలంటే నీ తండ్రి నుంచి నీ భర్త వరకు అందరు స్టార్లే.. నువ్వు ఒక పీడించబడిన అమ్మాయివి అంటే ఎవరైనా నమ్ముతారా..? అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి.