యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నటిస్తున్న కొత్త సినిమా ‘వినరో భాగ్యము విష్ణు కథ’. మురళి కిషోర్ అబ్బూరు తెరకెక్కిస్తున్న ఈ మూవీని ‘గీత ఆర్ట్స్ 2’ బ్యానర్ పై బన్నీ వాసు నిర్మిస్తున్నాడు. ఫిబ్రవరి 17న ప్రేక్షకుల ముందుకి రానున్న ఈ మూవీ నుంచి ‘దర్శన’ అనే సాంగ్ ని రిలీజ్ చేశారు. లవ్ ఫెయిల్ అయిన అబ్బాయి ఎమోషన్ ని షేర్ చేసుకునే సమయంలో వచ్చే ఈ సాంగ్ కి మ్యూజిక్ డైరెక్టర్ చైతన్ భరద్వాజ్ మంచి ట్యూన్ ఇచ్చాడు. భాస్కరభట్ల రాసిన లిరిక్స్ ప్రతి ఒక్కరూ ఓన్ చేసుకునేలా ఉన్నాయి. ప్రేమలో ఫెయిల్ అయిన ప్రతి ఒక్కరికీ ‘దర్శన’ సాంగ్ లిరిక్స్ కనెక్ట్ అవుతాయి. మంచి ట్యూన్, మంచి లిరిక్స్ కి సూపర్బ్ వోకల్స్ ని అందించాడు ‘అనురాగ్ కులకర్ణీ’. ఇతని వాయిస్ లోని మ్యాజిక్ దర్శన సాంగ్ ని మరింత స్పెషల్ గా మార్చింది. కిరణ్ అబ్బవరం, అనురాగ్ కాంబినేషన్ లో ఇప్పటికే ఎస్.ఆర్ కళ్యాణ మండపం సినిమాలోని ‘చుక్కల చున్నీనే’ అనే సాంగ్ సూపర్ హిట్ అయ్యింది. తాజాగా ఈ హీరో, సింగర్ కాంబినేషన్ లో ‘దర్శన’ కూడా హిట్ లిస్ట్ లో చేరింది. సాంగ్ మధ్యలో చూపించిన కిరణ్ అబ్బవరం డాన్స్ కూడా ఆకట్టుకుంది. మొత్తానికి ఒక ఫీల్ గుడ్ సాంగ్ ని ‘దర్శన’ రూపంలో గిఫ్ట్ గా ఇచ్చారు.
Read Also: Kiran Abbavaram: 2023లో కిరణ్ అబ్బవరం వరుస చిత్రాలు
హీరో కిరణ్ అబ్బవరంకి ‘వినరో భాగ్యము విష్ణు కథ’ సినిమా హిట్ అవ్వడం చాలా ఇంపార్టెంట్. 2022లో కిరణ్ అబ్బవరం మూడు సినిమాల్లో నటించాడు కానీ ఒక్కటి కూడా హిట్ టాక్ సొంతం చేసుకోలేదు. లాస్ట్ మూవీ ‘నేను మీకు బాగా కావాల్సిన వాడిని’ అయితే ఎప్పుడు రిలీజ్ అయ్యిందో ఎప్పుడు పోయిందో కూడా ఆడియన్స్ కి తెలియదు. ఇలాంటి సమయంలో కిరణ్ అబ్బవరం తన మార్కెట్ కాపాడుకోవాలి అంటే ‘వినరో భాగ్యమి విష్ణు కథ’ సినిమాతో పక్కా హిట్ కొట్టాల్సిందే. లేదంటే అతి తక్కువ కాలంలోనే ప్రేక్షకులు కిరణ్ అబ్బవరాన్ని ఆడియన్స్ మరిచిపోయే ప్రమాదం ఉంది.