Dammu Srija : అందరూ అనుకున్నట్టే దమ్ము శ్రీజ బిగ్ బాస్ సీజన్-9లోకి ఎంట్రీ ఇచ్చింది. తాజాగా స్టార్ట్ అయిన బిగ్ బాస్ సీజన్-9లోకి ఈ బ్యూటీ అడుగు పెట్టింది. గెస్ట్ గా వచ్చిన నవదీప్ ఆమె పేరును ఖరారు చేశాడు. దీంతో దమ్ము శ్రీజ ఆనందం అంతా ఇంతా కాదు. కామనర్ గా ఎంట్రీ ఇచ్చిన శ్రీజ.. అగ్నిపరీక్ష ప్రోగ్రామ్ లోనే అందరి మనసులు దోచుకుంది. అయితే ఈమె నెలకు లక్ష రూపాయల జీతం వదులుకుని బిగ్ బాస్ షోలోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ విషయమే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆమె ముక్కుసూటిగా మాట్లాడే అమ్మాయి.
Read Also : Bigg Boss 9 : మరీ ఓవర్ చేసిన మాస్క్ మ్యాన్ హరీష్.. ఇంత అవసరమా..?
గతంలో ఆమె సాఫ్ట్ వేర్ జాబ్ చేసింది. ఆమెకు నెలకు లక్ష రూపాయల దాకా జీతం ఉంది. కానీ చేస్తున్న పని కంటే తనను తాను ప్రూవ్ చేసుకోవాలని ఇంట్రెస్ట్ తోనే బిగ్ బాస్ షోలోకి ఎంట్రీ ఇవ్వాలని ఎప్పటి నుంచో ట్రై చేసింది. అనుకున్నట్టు గానే అగ్నిపరీక్షలో అందరినీ దడదడ లాడించి చివరకు హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆమె పేరులో ఉన్న దమ్ము.. మాటల్లోనూ ఉందని ఇప్పటికే నిరూపించుకుంది. ఆమె హౌస్ లో చాలా కాన్ఫిడెన్స్ గా ఎంటర్ టైన్ చేస్తుందనే నమ్మకం అందరికీ ఉంది. మరి హౌస్ లో ఎలా ఆడుతుందో వేచి చూడాలి.
Read Also : Shivani nagaram : శివానీ నగరం వరుస హిట్లు.. ఎవరీ బ్యూటీ..?