Shivani nagaram : శివానీ నగరం.. ఇప్పుడు మార్మోగిపోతున్న పేరు ఇది. టాలీవుడ్ లో వరుస హిట్లు అందుకుంది ఈ చిన్నది. అందానికి అందం, అభినయం రెండూ ఉండటంతో పాటు.. అమ్మడికి అదృష్టం కూడా బాగానే ఉంది. తాజాగా మౌళి హీరోగా శివానీ హీరోయిన్ గా చేసిన లిటిల్ హార్ట్స్ సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతోంది. అంతకు ముందు 8 వసంతాలు సినిమాలోనూ ఈమెనే హీరోయిన్ గా చేసింది. దీంతో ఈమె గురించి వెతుకుతున్నారు. ఈమె పుట్టి పెరిగింది హైదరాబాద్ లోనే.
Read Also : Little hearts : లిటిల్ హార్ట్స్ సినిమాకు మౌళి రెమ్యునరేషన్ ఎంతో తెలుసా..?
1988లో హైదరాబాదులో పుట్టిన శివానీ.. కూచిపూడి డ్యాన్స్ లో దిట్ట. పెద్దయ్యాక కూచిపూడి డ్యాన్స్ టీచర్ గా పనిచేసింది. కామర్స్ లో డిగ్రీ చేసిన తర్వాత పాటలు పాడుతూ, డ్యాన్స్ చేస్తూ ఇన్ స్టాలో రీల్స్ చేసేది. జాతిరత్నాలు సినిమాలో న్యూస్ ప్రజెంటర్ గా చిన్న పాత్రలో కనిపించింది. ఆ తర్వాత సుహాస్ హీరోగా వచ్చిన అంబాజీపేట మ్యారేజీ బ్యాండు సినిమాలో హీరోయిన్ గా ఛాన్స్ ఉందని తెలిసి ఆడిషన్ ఇచ్చింది. అదృష్టం కొద్దీ ఆమెనే హీరోయిన్ గా తీసుకున్నారు. రీసెంట్ గా 8 వసంతాలు సినిమాలో నటించి మెప్పించింది. ఇప్పుడు లిటిల్ హార్ట్స్ తో యూత్ కు ఫేవరెట్ అయిపోయింది.
Read Also : Raghava Lawrence : లారెన్స్.. నువ్వు బంగారం.. దివ్యాంగురాలికి ఏం చేశాడంటే..