Daggubati Abhiram: దగ్గుబాటి ఇంట పెళ్లి సందడి.. ?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Daggubati Abhiram: దగ్గుబాటి ఇంట పెళ్లి సందడి మొదలు కానుందా.. ? అంటే నిజమే అంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు. వెంకటేష్ అన్న సురేష్ దగ్గుబాటి రెండో కుమారుడు దగ్గుబాటి అభిరామ్ కు పెళ్లి చేయాలనీ పెద్దలు నిర్ణయించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. రానా తమ్ముడు అభిరామ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. గతంలో శ్రీరెడ్డి అతని పేరును ఎంతలా చెడగొట్టిందో అందరికీ తెల్సిందే. ఇక ఆ ఇన్సిడెంట్ అభిరామ్ కెరీర్ ను చాలా దెబ్బతీసింది. ఇవేమి జరగకుండా ఉంటే.. అభిరామ్ తెలుగుతెరకు ఎప్పుడో పరిచయమయ్యేవాడు. కానీ, అనుకోని సంఘటనలు జరగడంతో ఈ ఏడాది అహింస సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు. ఈ సినిమా అతనికి ఆశించిన ఫలితాన్ని మాత్రం అందివ్వలేకపోయింది. ఈ నేపథ్యంలోనే దగ్గుబాటి కుటుంబం అతడికి పెళ్లి చేయాలనే ఆలోచనలో ఉందట. ఇప్పటికే అమ్మాయిని కూడా వెతికినట్లు తెలుస్తోంది.
Jailer: వర్మ ప్లే లిస్ట్ లో డ్యాన్స్ చేసిన వ్యక్తి చనిపోయాడని మీకు తెలుసా.. ?
Also Read
- Ashwath Marimuthu: అనిల్ రావిపూడి స్పీడ్‌కి పోటీగా రజినీకాంత్ డైరెక్టర్.. 5 నెలల్లో సినిమా పూర్తి!
- Keerthy Suresh: నాని కోసం 13 ఏళ్ల తర్వాత స్పెషల్ సాంగ్.. ఐటం సాంగ్ కాదంటున్న కీర్తి సురేష్!
- Theatrical Releases: సెప్టెంబర్ లో సౌత్ సినిమాల జోరు… లవ్ స్టోరీల నుండి యాక్షన్ థ్రిల్లర్ల వరకు
- Spy Action Thriller: థియేటర్లలో పట్టించుకోలేదు.. ఓటీటీలో నంబర్ 1 ట్రెండింగ్ లో స్పై యాక్షన్ థ్రిల్లర్
ఇక రానాలా కాకుండా ఈసారి బంధువుల అమ్మాయినే కోడలిగా చేసుకోవాలని సురేష్ ముచ్చటపడుతున్నాడట. కారంచేడుకు చెందిన అభిరామ్ చినతాత కూతురు కూతురునే పెళ్లాడనున్నాడని టాక్. ఇప్పటికే ఇరు కుటుంబాల మధ్య పెళ్లి చర్చలు అన్ని పూర్తయ్యాయట. త్వరలోనే నిశ్చితార్థం.. ఆపై పెళ్లి జరగనున్నాయని సమాచారం. ఇక దీంతో దగ్గుబాటి అభిమానులు అభిరామ్ కు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. పెళ్లి తరువాత నుంచి అయినా అభిరామ్ లైఫ్ ఒక గాడిన పడుతుందని కుటుంబం మొత్తం ఆశిస్తున్నారు. ఇక రానా ప్రేమ వివాహం చేసుకోగా.. అభిరామ్ మాత్రం పెద్దలు కుదిర్చిన వివాహం చేసుకుంటున్నాడు. త్వరలోనే అధికారికంగా దగ్గుబాటి కుటుంబం అభిరామ్ పెళ్లి విషయం ప్రకటించనుంది. మరి దగ్గుబాటి కుటుంబం అనుకున్నట్లుగానే అభిరామ్ లైఫ్ పెళ్లి తరువాత మారుతుందేమో చూడాలి.
తాజావార్తలు
-
Pak Spy Network Busted: మేడ్ ఇన్ చైనా కెమెరాలు, పాక్‌కు లైవ్.. ఐఎస్ఐ గూఢచారి అరెస్ట్..
-
Bilawal Bhutto: యూరప్ యువరాణితో బిలావల్ భుట్టో పెళ్లి! సోషల్ మీడియాలో వైరల్
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Uttar Pradesh: యూపీలో హిందూ లీడర్ ధీరేంద్ర ప్రతాప్ సింగ్ హత్య..
-
North Cyprus: ఘోర ప్రమాదం.. సముద్రంలో ఫెర్రీ బోల్తా.. 270 మంది ఉన్నట్లు సమాచారం
ట్రెండింగ్
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!
-
Hockey World Cup 2026: నెదర్లాండ్స్ ఆధిపత్యానికి చెక్.. 16 ఏళ్ల తర్వాత హాకీ ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా!
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!