D. Imman: ద్వితీయ వివాహంపై వివరణ ఇచ్చిన సంగీత దర్శకుడు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఈ నెల 15వ తేదీ ప్రముఖ సంగీత దర్శకుడు డి. ఇమ్మాన్ ద్వితీయ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. 2008లో మోనికాను ప్రేమ వివాహం చేసుకున్న ఇమ్మాన్ గత యేడాది డిసెంబర్ లో ఆమెకు విడాకులు ఇచ్చాడు. అయితే తాజాగా చేసుకున్నది పెద్దలు కుదిర్చిన వివాహమని చెబుతూ, ఆ విషయమై తన మనసులోని భావాలను ఇమ్మాన్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.
Also Read

ప్రముఖ పబ్లిసిటీ డిజైనర్ స్వర్గీయ ఉబల్డ్, చంద్ర ఉబల్డ్ కుమార్తె అమలీతో తన పెళ్లి జరిగిందని, తన తండ్రి జె. డేవిడ్ కిరుబకర దాస్ తన కష్టకాలంగా దన్నుగా నిలిచి ఈ పెళ్ళి జరిపించారని ఇమ్మాన్ తెలిపాడు. పెద్దలు కుదుర్చిన ఈ వివాహం గత కొన్నేళ్ళుగా తాను, ఇతర కుటుంబ సభ్యులు ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారం చూపుతుందనే ఆశాభావాన్ని ఇమ్మాన్ వ్యక్తం చేశాడు. తన తల్లి స్వర్గీయ మంజులా డేవిడ్ తో పాటు ఇతర కుటుంబ సభ్యుల ఆశీస్సులతో అమలీ తన జీవితంలోకి అడుగుపెట్టిందన్నాడు.

ఇక నుండి అమలీ కుమార్తె నేత్ర తన మూడో కూతురుగా ఉంటుందని, ఆమె తండ్రిగా వ్యవహరించడం ఎంతో ఆనందంగా ఉందని చెప్పాడు. పెళ్ళి రోజున తన కూతుళ్ళు విరోనికా, బ్లెస్సికా లేకపోవడం లోటు అనిపించిందని, వారు తన ఇంటికి తిరిగి వచ్చే రోజు కోసం సహనంతో వేచి ఉంటానని అన్నాడు. తాను, అమలీ, నేత్రతో పాటు తమ బంధువులంతా వెరోనికా, బ్లెస్సికాను ప్రేమతో స్వాగతించడానికి సిద్ధంగా ఉన్నారని ఇమ్మాన్ తెలిపాడు. తమ పెద్ద కుటుంబంపై వెలకట్టలేని ప్రేమను చూపుతున్న అమలీకి ఈ సందర్భంగా ఇమ్మాన్ కృతజ్ఞతలు తెలిపాడు. అలానే గత కొన్నేళ్ళుగా తనకు సహకరిస్తున్న సంగీత ప్రియులకు ధన్యవాదాలు తెలిపాడు. విశేషమేమంటే ఇదే యేడాది ఏప్రిల్ మాసంలో డి. ఇమ్మాన్ సంగీత దర్శకుడిగా 20 యేళ్ల మైలురాయిని దాటాడు.
#DImman#AmaliUballd#Nethra pic.twitter.com/wRuKWxwuQD
— D.IMMAN (@immancomposer) May 17, 2022
తాజావార్తలు
-
Redmi K200 Series: Redmi K200 సిరీస్‌లో 7 ఇంచుల 2K డిస్ప్లే?.. హై రిఫ్రెష్ రేట్‌తో రానున్న కొత్త ఫ్లాగ్షిప్ ఫోన్లు!
-
Rashmika Mandanna : మరోసారి పుష్పరాజ్ అండ్ శ్రీవల్లి కాంబో ఆకట్టుకోబోతుందా..?
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Prabhas : వాయిదాలకు కేరాఫ్ అడ్రస్ ప్రభాస్ మూవీస్
-
Thomson 4K QLED Smart TVs: థామ్సన్ నుంచి కొత్త 4K QLED స్మార్ట్ టీవీలు.. ధర రూ.11,999 నుంచే!
ట్రెండింగ్
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!
-
WCL 2026: ఉతప్ప మెరుపులు వృథా.. భారత్ ఛాంపియన్స్‌పై సౌతాఫ్రికా విజయం.!