Be Alert : ఫ్రీగా సినిమా చూద్దామని కక్కుర్తిపడి ₹1,75,000 కోల్పోయిన వ్యక్తి!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రస్తుత డిజిటల్ యుగంలో సైబర్ నేరగాళ్లు సరికొత్తగా ఎర వేస్తూ సామాన్యులను దోచుకుంటున్నారు. ముఖ్యంగా సోషల్ మీడియాలో వచ్చే ఆకర్షణీయమైన ప్రకటనలను నమ్మి అడుగు వేస్తే, జీవితాంతం సంపాదించిన సొమ్ము ఆవిరైపోతుందని సైబరాబాద్ పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఇటీవల వెలుగులోకి వచ్చిన ఒక ఘటన షాక్ కలిగిస్తోంది. ఒక వ్యక్తి ఫేస్‌బుక్ బ్రౌజ్ చేస్తుండగా, “లేటెస్ట్ సినిమాలు ఫ్రీగా చూడండి – ఇప్పుడే Tubi TV యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి” అనే ప్రకటన కనిపించింది. ఆ ఆసక్తితో ఆయన అందులోని లింక్‌ను క్లిక్ చేయగా, అది ఒక వెబ్‌సైట్‌కు తీసుకెళ్లింది. అక్కడ నుంచి ఒక యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుని, సినిమా కూడా చూశారు. అంతా మామూలుగానే ఉందని భావిస్తున్న సమయంలోనే అసలు ప్రమాదం మొదలైంది.
కొంతసేపటికి మొబైల్ సాఫ్ట్‌వేర్ ఆటోమేటిక్‌గా అప్‌డేట్ అవుతున్నట్లు మెసేజ్ వచ్చింది. అది సాధారణ అప్‌డేట్ అని ఆయన అనుకున్నారు. కానీ, కొన్ని నిమిషాల తర్వాత ఫోన్ సరిగా పనిచేయకపోవడం, యూపీఐ సేవలు మొరాయించడం వంటి సమస్యలు తలెత్తాయి. అనుమానం వచ్చి బ్యాంక్ అకౌంట్ తనిఖీ చేయగా, తన ఖాతా నుండి ₹80,000, అదే ఫోన్‌లో లాగిన్ అయి ఉన్న తన తల్లి ఖాతా నుండి మరో ₹95,000 మాయమయ్యాయి. ఇలా కేవలం ఒకే ఒక్క తప్పుడు యాప్ వల్ల మొత్తం ₹1,75,000 కోల్పోవాల్సి వచ్చింది.
Also Read
- Sardar 2: కార్తి ‘సర్దార్ 2’ ట్రైలర్ కు టైమ్ ఫిక్స్ చేసిన మేకర్స్!
- YASH : టాక్సిక్ డిజాస్టర్ తర్వాత రాకింగ్ స్టార్ యశ్ నెక్ట్స్ ప్రాజెక్ట్ ఏంటి?
- Manisha Koirala: భారత్, చైనా అండగా ఉండాలి.. నేపాల్ వరదలపై కన్నీళ్లు పెట్టుకున్న మనీషా కొయిరాలా..
- Jailer 2: రజనీకాంత్ ‘జైలర్ 2’కు టాలీవుడ్ సినిమాల సెగ.. రిలీజ్ డేట్ మారుతుందా?
నిజానికి డౌన్‌లోడ్ చేసిన ఆ యాప్ అసలైన “Tubi TV” కాదు. అది అదే పేరుతో రూపొందించిన ఒక ప్రమాదకరమైన Malware అప్లికేషన్. ఈ మాల్వేర్ ఫోన్‌లోకి ప్రవేశించి, వచ్చే ఎస్ఎంఎస్ (SMS),ఓటీపీ (OTP)లను రహస్యంగా చదువుతుంది. బ్యాంకింగ్ యాప్స్‌పై నియంత్రణ సాధించి, మీకు తెలియకుండానే డబ్బును తరలిస్తుంది. అందుకే ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ వంటి వేదికలపై వచ్చే “Free Movie” లింకులను ఎట్టి పరిస్థితుల్లోనూ నమ్మవద్దు. గుర్తు తెలియని వెబ్‌సైట్ల నుండి యాప్స్ డౌన్‌లోడ్ చేయకండి. కేవలం అఫీషియల్ ప్లే స్టోర్ లేదా యాప్ స్టోర్ మాత్రమే వాడండి. అనవసరమైన యాప్‌లకు మీ మెసేజ్లు లేదా గ్యాలరీని చూసే పర్మిషన్స్ ఇవ్వకండి.
తాజావార్తలు
-
Se*xual Assault: తుక్కుగూడ నర్సు శిరీష హత్య కేసు.. లైంగిక దాడి చేసినట్లు నిర్ధారణ.. నిందితుడి అరెస్ట్.!
-
Sardar 2: కార్తి ‘సర్దార్ 2’ ట్రైలర్ కు టైమ్ ఫిక్స్ చేసిన మేకర్స్!
-
CTET 2026: సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్.. దరఖాస్తుకు రేపే చివరి ఛాన్స్..
-
YASH : టాక్సిక్ డిజాస్టర్ తర్వాత రాకింగ్ స్టార్ యశ్ నెక్ట్స్ ప్రాజెక్ట్ ఏంటి?
-
Gold Price Today: భారీగా తగ్గిన బంగారం ధరలు.. హైదరాబాద్‌లో 10 గ్రాముల గోల్డ్ రేట్ ఎంతంటే?
ట్రెండింగ్
-
క్రిస్టల్స్‌తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!