Dada Release Date: ‘అఖండ 2’ సీన్ రిపీట్ కానుందా? బాలయ్య ‘దాదా’పై సస్పెన్స్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Dada Release Date: నందమూరి బాలకృష్ణ నటిస్తున్న తాజా మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘దాదా’ చుట్టూ ఇప్పుడు టాలీవుడ్లో హాట్ హాట్ చర్చ నడుస్తోంది. గతంలో ‘అఖండ 2’ రిలీజ్ విషయంలో ఎలాంటి గందరగోళం, వాయిదాల పర్వం సాగిందో.. ఇప్పుడు ‘దాదా’ విషయంలోనూ దాదాపు అదే సీన్ రిపీట్ కానుందా అన్న అనుమానాలు సినీ వర్గాల్లో బలపడుతున్నాయి. క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 24న థియేటర్లలోకి రావాల్సిన ఈ చిత్రం.. చెప్పిన డేట్‌కే వస్తుందా లేక రేస్ నుంచి తప్పుకుంటుందా అనే సందిగ్ధత నందమూరి అభిమానులను తీవ్ర టెన్షన్‌కు గురిచేస్తోంది.
‘వీరసింహారెడ్డి’ లాంటి బ్లాక్‌బస్టర్ తర్వాత గోపీచంద్ మలినేని – బాలయ్య కాంబినేషన్లో వస్తున్న సినిమా కావడంతో దీనిపై మొదటినుంచీ భారీ అంచనాలున్నాయి. వాస్తవానికి ఈ ప్రాజెక్ట్‌ను దసరా బరిలోనే దించాలని భావించినా, షూటింగ్ ఆలస్యం కావడంతో డిసెంబర్ 24కి మార్చారు. తీరా కాకినాడ పోర్టులో కీలకమైన యాక్షన్ ఎపిసోడ్ తీస్తుండగా బాలకృష్ణకు కాలుజారి గాయం కావడంతో షూటింగ్‌కు బ్రేక్ పడింది. దాదాపు రెండు నెలల పాటు ఆయన విశ్రాంతి తీసుకోవాల్సి రావడంతో అసలు క్రిస్మస్కు రావడం అసాధ్యమనే ప్రచారం ఊపందుకుంది. అయితే డేట్ మిస్ కాకూడదన్న పట్టుదలతో బాలయ్య గాయం నుంచి కోలుకున్న వెంటనే నాన్‌స్టాప్‌గా రంగంలోకి దిగారు. మైసూర్ షెడ్యూల్ ముగించుకుని, రామోజీ ఫిల్మ్ సిటీలో నాలుగు రోజుల పాటు భారీ యాక్షన్ సీన్స్ పూర్తి చేశారు. కానీ కాకినాడలో మిగిలిపోయిన ఫైట్ సీక్వెన్స్‌ను రీ-షూట్ చేద్దామనుకునే సమయానికి తీరం దాటిన తుఫాను, ఎడతెరిపిలేని భారీ వర్షాలు యూనిట్ ప్లాన్‌ను పూర్తిగా దెబ్బతీశాయి.
Also Read
- Vishwak Sen: పాతాళంలోకి వెళ్లిపోతున్న నన్ను కాలర్ పట్టుకుని పైకి లాగింది తరుణ్ భాస్కరే.. విశ్వక్ ఎమోషనల్ స్పీచ్!
- Abhinav Gomatam: నెలకి 30 వేల జాబ్ వదిలేసి ఏడాదికి 30 వేలే సంపాదించా.. అన్నీ అవమానాలే
- Naga Chaitanya: నా మౌనాన్ని చాలామంది తప్పుగా అర్థం చేసుకుంటున్నారు
- RC 17 : రామ్ చరణ్ క్యారెక్టర్ ఏంటో తెలిసిపోయింది!
ప్రస్తుతం రిలీజ్‌కు కేవలం 50 రోజుల సమయం మాత్రమే మిగిలి ఉంది. ఇంకా బాలయ్య, కాజల్ అగర్వాల్ కాంబినేషన్లో ఒక పాటతో పాటు పలు కీలక సన్నివేశాల చిత్రీకరణ బ్యాలెన్స్ ఉన్నట్లు సమాచారం. దీనికి తోడు తమన్ సంగీతం అందిస్తున్న ఈ భారీ చిత్రానికి పోస్ట్ ప్రొడక్షన్, వీఎఫ్ఎక్స్ పనులకు కూడా తగినంత సమయం అవసరం. ఇంత తక్కువ టైంలో వాటన్నింటినీ పూర్తి చేసి డిసెంబర్ 24న థియేటర్లలోకి తీసుకురావడం మేకర్స్‌కు కత్తిమీద సాములా మారింది. ఈ నేపథ్యంలోనే సినిమా వాయిదా పడుతోందంటూ సోషల్ మీడియాలో జోరుగా ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి. మరి ఈ రూమర్లపై చిత్ర యూనిట్ క్లారిటీ ఇస్తుందా.. లేక గత అనుభవాల దృష్ట్యా సైలెంట్‌గా ఉండి రిలీజ్ డేట్‌ను మార్చుతారా అన్నది చూడాల్సి ఉంది.
తాజావార్తలు
-
Vishwak Sen: పాతాళంలోకి వెళ్లిపోతున్న నన్ను కాలర్ పట్టుకుని పైకి లాగింది తరుణ్ భాస్కరే.. విశ్వక్ ఎమోషనల్ స్పీచ్!
-
Abhinav Gomatam: నెలకి 30 వేల జాబ్ వదిలేసి ఏడాదికి 30 వేలే సంపాదించా.. అన్నీ అవమానాలే
-
Naga Chaitanya: నా మౌనాన్ని చాలామంది తప్పుగా అర్థం చేసుకుంటున్నారు
-
RC 17 : రామ్ చరణ్ క్యారెక్టర్ ఏంటో తెలిసిపోయింది!
-
Thiruparankundram: సుప్రీం ఆదేశాలున్నా ‘దీపతూన్’ వద్ద వెలగని కార్తీక దీపం.. తమిళనాడులో తీవ్ర ఉద్రిక్తత..
ట్రెండింగ్
-
6.58mm స్లిమ్ డిజైన్, 50MP కెమెరా, 6500mAh బ్యాటరీతో Huawei Mate 90 Air లాంచ్..!
-
2TB స్టోరేజ్, 8000 నిట్స్ బ్రైట్నెస్, 6200mAh బ్యాటరీతో Huawei Mate X8 లాంచ్..!
-
టీ20ల్లో చరిత్ర సృష్టించిన Priyansh Arya.. 68 బంతుల్లో 181 పరుగులు..! క్రిస్ గేల్ రికార్డ్ బద్దలు..
-
రూ.83 వేల ప్రారంభ ధరతో ఐదు వేరియంట్లతో లాంచ్.. Suzuki Access 125 స్కూటర్లో కొత్త కలర్స్..!
-
501.7cc ఇంజిన్, మూడు వేరియంట్లు.. రెట్రో లుక్‌తో Honda CB500 బైక్..!