Trailer Launch: క్రైమ్ థ్రిల్లర్‌గా ‘అం అః’
- Follow Us :
-
-
Add as a preferred
source on google
డిఫరెంట్ టైటిల్‌తో, ఈ జనరేషన్ యూత్ కోరుకునే థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది ‘అం అః’ చిత్రం. సుధాకర్ జంగం, లావణ్య హీరోహీరోయిన్లుగా నటించిన ఈ సినిమాను శ్యామ్ మండల దర్శకత్వంలో జోరిగె శ్రీనివాసరావు నిర్మిస్తున్నారు. మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా ప్రముఖ నిర్మాత బెక్కెం వేణు గోపాల్ ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేశారు. 152 సెకన్ల నిడివి గల ఈ ట్రైలర్‌లో.. క్రైమ్, సస్పెన్స్, రొమాన్స్, కామెడీ అన్నీ యాంగిల్స్‌ను చూపించారు. ట్రైలర్ ఆద్యంతం ఉత్కంఠ భరితంగా సాగింది. ఇక 24 గంటల్లో 20 లక్షలు ఎలా సంపాదిస్తారు? అక్రమంగా ఇరుక్కున్న కేసు నుంచి హీరో అతని ఫ్రెండ్స్ ఎలా తప్పించుకున్నారు? అసలు సిటీలో జరిగే హత్యలకు కారణం ఏంటి? అనే ఉత్కంఠను రేకెత్తించేలా ట్రైలర్ సాగింది. యాక్షన్ సీక్వెన్స్ తో పాటు నేపథ్య సంగీతం ఆకట్టుకునేలా ఉంది.
ట్రైలర్ రిలీజ్ చేసిన అనంతరం నిర్మాత బెక్కెం వేణు గోపాల్ మాట్లాడుతూ, ”దర్శకుడు శ్యామ్ నాకు చాలా ఏళ్ల నుంచి తెలుసు. ఆయన దర్శకత్వం వహించిన ‘అం అః’ మూవీ ట్రైలర్ చాలా బాగుంది. ఈ టైటిల్‌ను మేం చాలా సార్లు పెట్టాలని అనుకున్నాం. మంచి టైటిల్. మీ అందరికీ సినిమా నచ్చుతుందని భావిస్తున్నాను” అని అన్నారు. దర్శకుడు శ్యామ్ మాట్లాడుతూ, ”ఎన్నో సక్సెస్ ఫుల్ చిత్రాలను నిర్మించిన బెక్కెం వేణు గోపాల్ గారి చేతుల మీద మా సినిమా ట్రైలర్ రిలీజ్ అవ్వడం ఎంతో సంతోషంగా ఉంది. ఆయన బ్లెస్సింగ్స్ దొరకడం అదృష్టం. నాకు ఈ అవకాశం ఇచ్చిన నిర్మాతకు థ్యాంక్స్. ఈ చిత్రాన్ని అందరూ థియేటర్లోనే చూడాలని కోరుకుంటున్నాను” అని చెప్పారు. చిత్ర కథానాయకుడు సుధాకర్ జంగం, నిర్మాత శ్రీనివాసరావు మూవీ విజయంపై ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ నెల చివరి వారంలో ‘అం అః’ జనం ముందుకు రానుంది.
Also Read
https://youtu.be/hcTK4xtYxh4
తాజావార్తలు
-
Fahadh Faasil : ‘జై ఎన్టీఆర్’ అంటూ ఫాఫా.. తారక్‌తో ఆ రాత్రులు మరిచిపోలేనంటూ
-
Story Board : సైబర్ నేరాలు ఎందుకు పెరుగుతున్నాయి..?
-
Jr.NTR : కార్తికేయ నా తమ్ముడి లాంటోడు.. ఎన్టీఆర్ ఎమోషనల్ స్పీచ్
-
SS Rajamouli : ‘ఏడ్చి ఏడ్చి కళ్లు ఉబ్బిపోయాయి.. ఫాఫా నటన అద్భుతం’
-
Jr NTR : ‘యమదొంగ’ మ్యాజిక్ రిపీట్.. తారక్ మాస్ ఎంట్రీకి ఫ్యాన్స్ ఫిదా
ట్రెండింగ్
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!