Mansoor Ali Khan: మన్సూర్ కు షాక్ ఇచ్చిన కోర్ట్.. బెయిల్ ఇచ్చే ప్రసక్తే లేదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mansoor Ali Khan: మన్సూర్ ఆలీఖాన్.. సినిమాల ద్వారా ఎంత పేరు తెచ్చుకున్నాడో తెలియదు కానీ, వివాదాల ద్వారా మాత్రం బాగా ఫేమస్ అయ్యాడు. ఇండస్ట్రీ మొత్తం ఇప్పుడు అతని గురించే మాట్లాడుతుంది అంటే అతిశయోక్తి కాదు. హీరోయిన్ త్రిష పై అనుచిత వ్యాఖ్యలు చేసి.. ఇండస్ట్రీ టార్గెట్ గా మారాడు. లియో సినిమాలో త్రిషను రేప్ చేసే సన్నివేశం ఉంటుంది అనుకున్నాను అని ఇంటర్వ్యూలో మాట్లాడివివాదాన్ని సృష్టించిన మన్సూర్.. తప్పు చేసినట్లు ఒప్పుకోకుండా.. త్రిష, నా ఫోటోలు పక్క పక్కన పెట్టి వార్తలు రాస్తుంటే.. మా ఇద్దరికీ పెళ్లి జరిగినట్లు అనిపిస్తుందని మరింత నీచంగా మాట్లాడి షాక్ ఇచ్చాడు. ఇక దీంతో మన్సూర్ తన వైఖరిని మార్చుకోడని అర్థమై.. తమిళ్ నడిగర్ సంఘం అతనిని తాత్కాలికంగా బ్యాన్ చేసింది. ఇంకోపక్క పోలీస్ స్టేషన్ లో కేసు నమోదయ్యింది. ఇక కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. మన్సూర్ ను కోర్టు లో హాజరు పరిచారు. ఇక కోర్ట్ లో బెయిల్ కావాలంటూ మన్సూర్ మరో పిటిషన్ దాఖలు చేశాడు.
Israel: అల్-షిఫా ఆస్పత్రి డైరెక్టర్, డాక్టర్లను అరెస్ట్ చేసిన ఇజ్రాయిల్..
Also Read
- Director Shouryuv: నెట్‌ఫ్లిక్స్ సమర్పణలో 'హాయ్ నాన్న' డైరెక్టర్ లార్జర్-దేన్-లైఫ్ ప్రాజెక్ట్! అసలు కథ ఇదే..
- Tharun - Eesha: జంటగా గణపయ్య పూజలో తరుణ్ భాస్కర్ - ఈషా రెబ్బ ! ఇక పెళ్లికి అఫీషియల్ ప్రకటన వచ్చినట్లేనా ?
- Saif Ali Khan : సైఫ్ అలీ ఖాన్ ఇంట్లో గణపతి విగ్రహం.. తయ్యారు చేసింది ఎవరో తెలిస్తే ఫిదా అవ్వాల్సిందే!
- Bollywood : సూపర్ హీరో కథలపై బాలీవుడ్ స్టార్ హీరోస్ మోజు
ఇక ఈ కేసులో చెన్నైలోని థౌజండ్ ఐలాండ్ ఉమెన్ పోలీస్ స్టేషన్‌లో నేడు విచారణకు ఆయన వ్యక్తిగతంగా హాజరయ్యాడు. ఇక కోర్టు.. మన్సూర్ కు షాక్ ఇచ్చింది. బెయిల్ ను తిరస్కరిస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేసింది. అయితే దానికి కారణం.. అతను దాఖలు చేసిన పిటిషన్ లో తప్పులు ఉన్నట్లు కోర్టు గుర్తించడమే. పిటిషన్ సరిగ్గా పెట్టడం కూడా రాకుండా బెయిల్ ఎలా మంజూరు చేస్తారని కోర్టు ప్రశ్నించింది. అంతేకాకుండా విలువైన కోర్టు సమయాన్ని వృధా చేసినందుకు.. మన్సూర్ ను హెచ్చరించింది. ప్రస్తుతం మన్సూర్ పై ఉన్న కేసు ఇంకా విచారణలోనే ఉంది. మరి ముందు ముందు ఈ కేసు ఎక్కడివరకు వెళ్తుందో చూడాలి.
తాజావార్తలు
-
Nandigram Bypoll: ఉద్యోగం కోల్పోయిన టీచర్.. నందిగ్రామ్ పోరులో మమతా బెనర్జీ అభ్యర్థి..
-
CM Vijay: త్రిషతో కలిసి విదేశాల్లో తిరుగుతారా? సీఎం విజయ్‌పై విపక్షాలు ధ్వజం
-
Iran War: విమానం కూలింది.. ఎముకలు విరిగాయి.. అయినా వెనక్కి తగ్గలేదు.. ఇరాన్లో అమెరికా సైనికుడి పోరాటం
-
Vaibhav Sooryavanshi: ‘నేను ఏం తప్పు చేశా..?’.. కోపంతో రగిలిపోతున్న వైభవ్ సూర్యవంశీ..
-
Director Shouryuv: నెట్‌ఫ్లిక్స్ సమర్పణలో ‘హాయ్ నాన్న’ డైరెక్టర్ లార్జర్-దేన్-లైఫ్ ప్రాజెక్ట్! అసలు కథ ఇదే..
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!