Kiara Advani: ‘టాక్సిక్’ ఇంటిమేట్ సీన్ల గురించి మా ఆయన నాతో మాట్లాడలేదు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kiara Advani: పెళ్లయిన తర్వాత హీరోయిన్లు బోల్డ్ సీన్లలో నటిస్తే ఇంట్లో వాళ్లు ఎలా రియాక్ట్ అవుతారో అన్న ఆసక్తి చాలామందిలో ఉంటుంది. రాకింగ్ స్టార్ యశ్ హీరోగా వచ్చిన ‘టాక్సిక్’ సినిమాలోని ఇంటిమేట్ సీన్ల విషయంలో బాలీవుడ్ బ్యూటీ కియారా అడ్వాణీపై సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోలింగ్ జరిగిన సంగతి తెలిసిందే. అయితే, ఆ వివాదం నడుస్తున్న సమయంలో తన భర్త సిద్ధార్థ్ మల్హోత్రా కనీసం ఆ విషయం గురించి తనతో మాట్లాడలేదని కియారా తాజాగా వెల్లడించారు. ‘కాఫీ విత్ కరణ్ సీజన్ 9’ షోలో సిద్ధార్థ్‌తో కలిసి పాల్గొన్న కియారా, ఆనాటి పరిస్థితులను గుర్తుచేసుకున్నారు. పెళ్లి తర్వాత అలాంటి సన్నివేశాల్లో నటించడంపై వచ్చిన విమర్శలను సిద్ధార్థ్ అసలు పట్టించుకోలేదని ఆమె తెలిపారు. “ఆ ట్రోలింగ్ గురించి సిద్ధార్థ్ నాతో ఎప్పుడూ ప్రస్తావించలేదు, మేమిద్దరం దాని గురించి అసలు మాట్లాడుకోలేదు. ఆయన ఏమాత్రం బాధపడలేదు” అంటూ భర్త తనకు ఇచ్చిన సపోర్ట్ గురించి కియారా చెప్పుకొచ్చారు.
ఇక తనపై జరిగిన ట్రోలింగ్‌ను తాను కూడా పెద్దగా సీరియస్‌గా తీసుకోలేదని కియారా అన్నారు. ఇండస్ట్రీలో హీరోయిన్లకు ఇలాంటి విమర్శలు కొత్తేమీ కాదని, దశాబ్దాలుగా ఇదే జరుగుతోందని అభిప్రాయపడ్డారు. గతంలో ఐశ్వర్య రాయ్ నుంచి ఎంతోమంది స్టార్ హీరోయిన్లు ఇలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నారని గుర్తుచేశారు. అందుకే ఆ సమయంలో సోషల్ మీడియాలో ఎవరికీ వివరణ ఇవ్వాల్సిన అవసరం తనకు కనిపించలేదని చెప్పారు. మరోవైపు, ‘టాక్సిక్’ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన విజయం సాధించకపోవడంపై కియారా కొంత ఆవేదన వ్యక్తం చేశారు. సినిమా రిలీజైన మొదటి వీకెండ్లో వచ్చిన ఫలితం తనను చాలా నిరాశపరిచిందన్నారు. అయినప్పటికీ, తన కంఫర్ట్ జోన్ దాటి చేసిన పాత్రకు ప్రశంసలు దక్కడం సంతోషాన్నిచ్చిందని, ఈ సినిమా తన కెరీర్లో ఎప్పటికీ ప్రత్యేకంగా నిలిచిపోతుందని కియారా చెప్పుకొచ్చారు.
Also Read
- Idupu Kayitham Teaser: 'ఇడుపు కాయితం' అంటే.. విడాకులా..?
- Sekhar Master: శంషాబాద్ వద్ద రోడ్డు ప్రమాదం.. కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్‌కు గాయాలు..
- Kavya-Anirudh Wedding: కావ్య మారన్-అనిరుధ్ పెళ్లికి ఎంత ఖర్చు చేశారో తెలుసా? విందు ఖర్చు తెలిస్తే షాకే!
- Ramayana Box Office: ‘రామాయణ’ సేఫ్ జోన్లోకి వెళ్లాలంటే ఇంకా ఎన్ని కోట్లు కావాలి?
తాజావార్తలు
-
Kiara Advani: ‘టాక్సిక్’ ఇంటిమేట్ సీన్ల గురించి మా ఆయన నాతో మాట్లాడలేదు..
-
El Nino: ఎల్‌నినో దెబ్బ.. చుట్టుముడుతున్న వ్యాధులు..WHO సంచలన ప్రకటన!
-
Pat Cummins: ట్యాంపరింగ్ కలకలం.. పబ్లిక్‌లోనే భార్యతో గొడవ.. ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమిన్స్ కీలక ప్రకటన..
-
Smoking Vs Alcohol: స్మోకింగ్ మానడమే కష్టమా? ఇందులో నిజమెంత?
-
AP High Court: పంచాయతీ ఎన్నికల నామినేషన్లపై హైకోర్టు కీలక తీర్పు.. అధికారులకు ఆదేశాలు!
ట్రెండింగ్
-
India Playing XI 4th ODI: గిల్, రాహుల్, కాంబోజ్ అవుట్.. ఇషాన్ కిషన్, సిరాజ్ ఇన్.. కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్..!
-
ICC కీలక నిర్ణయాలపై ఉత్కంఠ.. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో కీలక మార్పులు.. 12 జట్లతో ప్లాన్.?
-
Moringa Soup: ఖరీదైన స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ వద్దు.. వింటర్లో బుగ్గలపై సహజమైన ఎరుపుదనం తెచ్చే సూప్ ఇదే..
-
Cigarette Prices Hike: ధూమపాన ప్రియులకు షాక్.. మరోసారి సిగరెట్ల ధరల బాదుడు..! ఒక్క ప్యాకెట్‌పై ఏకంగా..
-
Kusal Mendis: విమర్శకుల నోళ్లు మూయించిన కుశాల్ మెండిస్.. 13,000 పరుగుల మైలురాయిని అందుకున్న ఆటగాడిగా ఘనత..!