Pawan Kalyan: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఒకపక్క సినిమాలతో, మరోపక్క రాజకీయాలతో బిజీగా ఉంటున్న విషయం విదితమే. ఇక మూడు రోజుల క్రితం పవన్ కళ్యాణ్ ను కొన్ని అనుమానాస్పద వాహనాలు ఫాలో అవ్వడం, పవన్ హత్యకు కొంతమంది సుఫారీ తీసుకున్నారని వస్తున్న వార్తలు సంచలనం సృష్టిస్తున్నాయి. దీంతో పవన్ కళ్యాణ్ సెక్యూరిటీ అంతకన్నా ఎక్కువగా పెరిగింది. ఇక ఈ విషయం తెలియడంతో పవన్ అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ వార్త వచ్చిన దగ్గరనుంచి మెగా ఫ్యామిలీ సైతం పవన్ కు జాగ్రత్తలు చెప్తున్నారట.
ఇక మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అయితే తన పర్సనల్ సెక్యూరిటీ టీమ్ ను బాబాయ్ పవన్ వద్ద నియమించారట. పవన్ ఎక్కడికి వెళ్లినా ఈ సెక్యూరిటీ ఆయనతోనే ఉంటున్నది. ఇక తాజాగా పవన్ నడిరోడ్డుపై నడుస్తుండగా.. చుట్టూ జెట్ సెక్యూరిటీని ఏర్పాటు చేశారు. సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలోను ఆయన చుట్టూ సెక్యూరిటీ ని ఏర్పాటు చేయించాడట రామ్ చరణ్. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది.
#PawanKalyan 𓃬 pic.twitter.com/Fo2nsferDG
— The PrOtaGonist 火 (@KalyanForever_) November 4, 2022