Coolie : సూపర్ స్టార్ రజినీకాంత్ కు ఉన్న ఇమేజ్ అంతా ఇంతా కాదు. మామూలు జనాలే కాదు.. సెలబ్రిటీలు, బిజినెస్ పర్సన్లలో కూడా రజినీకాంత్ సినిమాలకు అభిమానులు ఉన్నారు. గతంలో ఎన్నోసార్లు చాలా కంపెనీల అధినేతలు తమ ఉద్యోగులకు రజినీ సినిమా సందర్భంగా లీవ్ ఇచ్చిన ఘటనలు చూశాం. ఇప్పుడు ఓ కంపెనీ బంపర్ ఆఫర్ ఇచ్చింది. రజినీకాంత్ నటించిన కూలీ మూవీ ఆగస్టు 14న రాబోతోంది. ఈ సందర్భంగా కూలీ సినిమా కోసం ఓ బడా కంపెనీ తమ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఆగస్టు 14న సాలరీతో కూడిన లీవ్ ఇస్తూనే ఫ్రీగా కూలీ మూవీ టికెట్లు కూడా బుక్ చేసింది.
Read Also : WAR 2 : జూనియర్ ఎన్టీఆర్ చెప్పినట్టే వార్-2.. ఫ్యాన్స్ డోంట్ వర్రీ
దీంతో ఉద్యోగులు ఎగిరి గంతేస్తున్నారు. సాధారణంగా కంపెనీలు జరాలు వస్తేనే సరిగ్గా లీవ్ లు ఇవ్వవు. గవర్నమెంట్ హాలిడేస్ లో కూడా రన్ చేస్తారు. అలాంటిది ఒక హీరో సినిమా కోసం ఇలాంటి ఆఫర్ అంటే మాటలు కాదు కదా. ఈ కంపెనీకి సౌత్ ఇండియాతో పాటు నార్త్ లో చాలా కంపెనీ బ్రాంచ్ లు ఉన్నాయంట. ఇక రజినీకాంత్ 50 ఏళ్ల కెరీర్ కంప్లీట్ చేసుకున్న సందర్భంగా అనాథ ఆశ్రమాల్లో పిల్లలకు అన్నదాన కార్యక్రమాలు చేస్తోంది. ఈ విషయం ఇప్పుడు సోషల్ మీడియాను ఊపేస్తోంది. ఎంతైనా రజినీకాంత్ సినిమా కదా. ఏ హీరోలకు లేనంత ఇమేజ్ ఆయన సొంతం. కూలీకి కార్పొరేట్ కంపెనీలే తమ ఉద్యోగుల కోసం టికెట్లు బుక్ చేయడం ఇదేం కొత్త కాదు. గతంలోనూ చాలా జరిగాయి.
Read Also : Spirit : అక్కడున్నది ప్రభాస్.. సందీప్ రెడ్డి అంత ధైర్యం చేస్తాడా..?