Suman Shetty : బిగ్ బాస్ సీజన్-9 ప్రస్తుతం ఫుల్ ట్రెండ్ అవుతోంది. ఈ సీజన్ లో ఎక్కువగా పాజిటివ్ వైబ్స్ సంపాదించుకుంటోంది మాత్రం సుమన్ శెట్టి అనే చెప్పుకోవాలి. ఈ కమెడియన్ ఒకప్పుడు చాలా సినిమాల్లో మెరిశాడు. అయితే సుమన్ శెట్టి ఇప్పటికీ తన ఇంట్లో ఓ డైరెక్టర్ ఫొటో పెట్టుకుని పూజ చేస్తున్నాడు. ఆ డైరెక్టర్ ఎవరో కాదు తేజ. సుమన్ శెట్టిని పరిచయం చేసింది తేజనే. ఔనన్నా కాదన్నా, జయం లాంటి సినిమాల్లో అవకాశాలు ఇవ్వడంతో మనోడికి బాగా ఫేమ్ వచ్చి వంద సినిమాలకుపైగా నటించాడు.
Read Also : Maheshwari : హీరోయిన్ ఇష్టపడితే.. చెల్లి అని పిలిచిన హీరో..
ఓ సారి సుమన్ డైరెక్టర్ తేజ దగ్గరకు వెళ్లి ఆయన కాళ్లకు నమస్కరించబోయాడు. తేజ వద్దని చెప్పాడు. మీ వల్లే ఇదంతా వచ్చింది సార్.. మీకు ఏం చేయాలి నేను అని అడిగాడు సుమన్. నువ్వు మంచి ఇల్లు కొనుక్కో. ఇప్పుడు రేట్లు తక్కువగా ఉన్నాయ్. నీ ఇంట్లో నాకు ఒక రూమ్ ఉంచు. భవిష్యత్ లో నేను సినిమాలు లేక రోడ్డు మీదకు వచ్చినప్పుడు నీ ఇంటికి వస్తాను. ఆ రూమ్ లోనే ఉంటా అని చెప్పాడంట తేజ. అందుకే అప్పటి నుంచి సుమన్ తన ఇంట్లో ఓ రూమ్ ను తేజ కోసం ఉంచేసి అందులో తేజ ఫొటో పెట్టుకుని పూజ చేస్తున్నాడంట. ఈ విషయాన్ని తేజ స్వయంగా ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు.
Read Also : Bigg Boss 9 : రీతూ చౌదరి ట్రయాంగిల్ లవ్ స్టోరీ.. తనూజ అతనితో.. అరేయ్ ఏంట్రా ఇది..