Maheshwari : సినిమాల్లో నటించే క్రమంలో హీరో, హీరోయిన్ల మధ్య లవ్ ట్రాక్ లు అనేవి సర్వ సాధారణం. గతంలోనూ ఇలాంటివి అనేకం జరిగాయి. అయితే ఓ హీరోయిన్ ఇష్టపడితే ఆ హీరో చెల్లి అని పిలిచాడంట. హీరో మహేశ్వరి తెలుగులో చాలా పాపులర్. గులాబి, పెళ్లి లాంటి సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. స్టార్ హీరోతో తన లవ్ మొదలు కాకముందే ఎలా బ్రేక్ అయిందో జగపతి బాబు హోస్ట్ గా చేస్తున్న జయమ్ము నిశ్చయమ్మురా షోలో వెల్లడించింది.
Read Also : Mirai : తేజ నిర్ణయం సక్సెస్.. మిగతా హీరోలు ఫాలో అయితే బెటర్..
నేను తమిళ హీరో అజిత్ కు పెద్ద ఫ్యాన్. ఆయనతో ఉల్లాసం, నీసమ్ సినిమాలు చేశా. ఆయనపై చాలా క్రష్ ఏర్పడింది. నా మనసులో మాట చెప్పాలని ఎన్నోసార్లు అనుకున్నా. రెండో సినిమా చాలా లేట్ అయింది. దీంతో ఆయనతో ఎక్కువ సేపు గడిపే టైమ్ దొరికింది. చివరి రోజు షూటింగ్ కు వెళ్లినప్పుడు.. ఇక అజిత్ తో గడిపే టైమ్ దొరకదని చాలా బాధపడుతూ కూర్చున్నా. నా మనసులో మాట అజిత్ కు చెప్పలేదు. నేను బాధపడటం చూసి అజిత్ నా దగ్గరకు వచ్చి.. నువ్వు నా చెల్లెలు లాంటి దానివి. నీకు ఏ సమస్య వచ్చినా నాకు చెప్పు అనేసరికి నేను షాక్ అయ్యా. దాంతో ఆయనకు నా మనసులో మాట చెప్పలేదు అంటూ చెప్పుకొచ్చింది బ్యూటీ.
Read Also : Bigg Boss 9 : రీతూ చౌదరి ట్రయాంగిల్ లవ్ స్టోరీ.. తనూజ అతనితో.. అరేయ్ ఏంట్రా ఇది..