Comedian Satya: ‘రంగబలి’ కోసం ‘సత్యబలి’.. వాళ్లలో ఎవరినీ వదల లేదుగా!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Comedian Satya Rangabali Interview: తెలుగు సినీ పరిశ్రమలో ప్రస్తుతమున్న ప్రతిభావంతులైన హాస్యనటుల్లో సత్య ఒకరు అనడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు. సత్య టైమింగ్, ఆయన డైలాగ్ డెలివరీ ఒకప్పటి కమెడియన్స్ ను గుర్తు చేయకుండా చాలా యూనిక్ అనిపిస్తూ ఉంటుంది. అయితే సత్య తాజాగా నాగశౌర్య హీరోగా తెరకెక్కిన ‘రంగబలి’ సినిమాలో నటించారు. ఈ సినిమా వచ్చే నెల 7న ప్రేక్షకుల ముందుకు వస్తోన్న క్రమంలో సినిమా యూనిట్ ప్రమోషన్స్‌పై దృష్టిపెట్టింది. ఇప్పటికే హీరో నాగశౌర్య ప్రెస్ మీట్ నిర్వహించగా మీడియా సంస్థలకు వరుసగా ఇంటర్వ్యూ ఇస్తున్నారు. అయితే, చిత్ర నిర్మాణ సంస్థ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ ఒక సంచలన ఇంటర్వ్యూ ప్లాన్ చేసింది. ఈ ఇంటర్వ్యూలో నాగశౌర్య, సత్య ఇద్దరే కనిపిస్తూ ఉండగా నాగశౌర్యను సత్య ఇంటర్వ్యూ చేస్తున్నారు. అయితే ఇక్కడ సత్య ఒక నటుడిగా శౌర్యను ఇంటర్వ్యూ చేయడం లేదు, ఈ ఇంటర్వ్యూలో ప్రత్యేక ఏమిటంటే.. తమ ఇంటర్వ్యూలు, షోలు, ప్రెస్ మీట్ల ద్వారా పాపులర్ అయిన ఐదుగురు తెలుగు పాపులర్ జర్నలిస్టులను సత్య ఇమేట్ చేయడమే.
Sai Chand Death: సాయిచంద్ మృతదేహానికి కేసీఆర్ నివాళి.. కన్నీళ్లను ఆపుకుంటూ?
Also Read
- Peddi Controversy : 'పెద్ది' ముద్దుపై బుచ్చిబాబు ఫస్ట్ రియాక్షన్... ఏమన్నారంటే?
- NTR Viral Tweet: కుకీలు పంపమన్న అభిమాని.. ఎన్టీఆర్ క్రేజీ రిప్లై ట్వీట్ వైరల్!
- Jhanvi Kapoor : ఇన్‌స్టాగ్రామ్‌లో పెద్ది నెగిటివ్ రివ్యూ పోస్ట్‌ను లైక్ చేసిన జాన్వీ.. ఫీలైనట్టుంది?
- PEDDI : రాయలసీమలో దేవరను దాటలేకపోయిన 'పెద్ది'
ఆ ఐదుగురు ఎవరంటే ఒక మీడియా సంస్థ అధినేత రాధాకృష్ణ, ఒక వెబ్ పోర్టల్ జర్నలిస్ట్ మూర్తి, సీనియర్ జర్నలిస్ట్- బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్ జాఫర్, ‘సంతోషం’ సురేష్ కొండేటి, న్యూస్ ప్రెజెంటర్ దేవీ నాగవల్లిలను ఈ ఇంటర్వ్యూలో సత్య ఇమిటేట్ చేస్తూ కనిపించారు. ఈ ప్రోమోను విడుదల చేయగా అది యితే సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ‘రంగబలి’ సినిమా ద్వారా పవన్ బాసంశెట్టి దర్శకుడిగా పరిచయం అవుతుండగా ఎస్ఎల్వి సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో యుక్తి తరేజా హీరోయిన్ కాగా ‘దసరా’ ఫేమ్ షైన్ టామ్ చాకో విలన్ గా నటిస్తున్నాడు.. సత్య, సప్తగిరి, బ్రహ్మాజీ, మురళీ శర్మ, గోపరాజు రమణ, భద్రం, నోయల్, అనంత శ్రీరామ్ ఇతర ముఖ్య పాత్రలు పోషించిన ఈ సినిమాకు పవన్ సిహెచ్ సంగీతం సమకూర్చారు.
తాజావార్తలు
-
India Forex Reserves: రూపాయి స్థిరత్వానికి బలం.. పెరిగిన విదేశీ మారక నిల్వలు.. 938 మిలియన్ డాలర్ల వృద్ధి
-
Vinukonda: అత్యాచారం చేశాడంటూ ఫిర్యాదు.. పోలీస్ స్టేషన్ లో లొంగిపోయిన మాజీ సీఐ చినమల్లయ్య.!
-
Peddi: జాన్వీ కపూర్ పాత్రపై డైరెక్టర్ బుచ్చిబాబు సంచలన వ్యాఖ్యలు!
-
Abhijeet Dipke: అమెరికా నుంచి ఢిల్లీ చేరుకున్న కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు.. నేటి నుంచి నిరసనలు
-
Vladimir Putin: “భారత్‌ను భయపెట్టాలని చూస్తే మీకే నష్టం”.. ఆ దేశాలకు పుతిన్ స్ట్రాంగ్ వార్నింగ్!
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!