Sai Chand Death: సాయిచంద్ మృతదేహానికి కేసీఆర్ నివాళి.. కన్నీళ్లను ఆపుకుంటూ?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM KCR Emotional after seeing Sai Chand Dead body: ప్రముఖ సింగర్, తెలంగాణ గిడ్డంగుల సంస్థ చైర్మన్ సాయిచంద్ మృతితో బీఆర్ఎస్‌లో తీవ్ర విషాదం నెలకొన్న సంగతి తెలిసిందే. ఆయన మృతి పట్ల బీఆర్ఎస్ నేతలు సంతాపం వ్యక్తం చేస్తుండగా అగ్ర నేతలు హైదరాబాద్ గుర్రంగూడలోని ఇంటికెళ్లి సాయిచంద్ మృతదేహానికి నివాళులు అర్పిస్తున్నారు. సాయిచంద్ మృతదేహానికి సీఎం కేసీఆర్‌తో పాటు మంత్రులు కేటీఆర్, హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డి సహా పలువురు ఎమ్మెల్యేలు, రాష్ట్ర స్థాయి నేతలు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా సాయిచంద్‌తో ఉన్న సాన్నిహిత్యాన్ని వారంతా గుర్తు చేసుకుంటూ కన్నీటిపర్యంతమవుతున్నారు. ముఖ్యంగా కేసీఆర్ సాయిచంద్ మృతి పట్ల తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేసి సాయిచంద్ మృతదేహాన్ని చూసి భావోగ్వేగానికి గురైయ్యారు.
SPY Movie Review: నిఖిల్ సిద్దార్థ్ ‘స్పై’ మూవీ రివ్యూ
Also Read
- Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
- Telangana Civil Supplies : రైస్ మిల్లర్లకు తెలంగాణ సర్కార్ వార్నింగ్.. ఆస్తులు జప్తే
- Harish Rao : సీఎం రేవంత్‌పై హరీశ్ రావు ఫైర్.. ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై సవాల్
- Bollaram Army Weapons Theft: బొల్లారం ఆయుధాల చోరీలో బిగ్ ట్విస్ట్.. లోపలి వ్యక్తులే సూత్రధారులు
ఒకానొక దశలో ఉబికి వస్తున్న కన్నీటిని అదిమిపట్టుకుని అలానే చూస్తూ ఉండి పోయారు. ఇక కుటుంబ సభ్యులకు ఆయన ధైర్యం చెబుతుండగా కేసీఆర్‌ను పట్టుకుని సాయిచంద్ తండ్రి కన్నీళ్లు పెట్టుకున్నారు. దీంతో సాయిచంద్ తండ్రిని కేసీఆర్ ఓదార్చడమే కాక చిన్న వయస్సులోనే సాయిచంద్ మరణం తనను తీవ్రంగా కలచివేసిందని అన్నారు. సాయిచంద్ మృతదేహానికి హరీష్ రావు, కేటీఆర్ లు ఈ ఉదయమే నివాళులు అర్పించారు. సాయిచంద్ మృతదేహాన్ని చూసి హరీష్, కేటీఆర్ ఇద్దరూ కంటతడి పెట్టుకున్నారు. కుటుంబసభ్యులను ఓదార్చి ధైర్యంగా ఉండాలని తాము అంతా అండగా ఉంటామని హామీ ఇచ్చారు.
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!