Raju Srivatsava: కోమాలో కమెడియన్.. అర్ధరాత్రి ఆగంతకుడు హల్చల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Raju Srivatsava: ప్రముఖ బాలీవుడ్ కమెడియన్ రాజు శ్రీవాత్సవ గుండెపోటుతో ఆసుపత్రిలో చేరిన విషయం విదితమే. జిమ్ చేస్తుండగా రాజు ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. వెంటనే అతనిని ఢిల్లీలోని ఎయిమ్స్ హాస్పిటల్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే మొన్నటివరకు అతడి మెదడు పనిచేసిందని, మూడు రోజుల నుంచి అతడి బ్రెయిన్ డెడ్ అవ్వడం వలన ఎలాంటి చికిత్సకు స్పందించడం లేదని వైద్యులు తెలుపుతున్నారు. ఇక ఈ నేపథ్యంలోనే ఒక విచిత్ర సంఘటన చోటుచేసుకొంది. రాజు శ్రీవాత్సవ ఉన్న హాస్పిటల్ లోకి ఒక ఆగంతకుడు చొరబడ్డాడు. కోమాలో ఉన్న అతనితో సెల్ఫీలు దిగుతూ వింతగా ప్రవర్తించాడు. ఈ ఘటన ఆదివారం అర్ధరాత్రి జరిగినట్లు చెప్పుకొస్తున్నారు.
హాస్పిటల్ లో అందరి కళ్లు కప్పి ఒక వ్యక్తి రాజు శ్రీవాత్సవ ఉన్న గదిలోకి వెళ్ళాడు. అక్కడ కోమాలో ఉన్న అతనితో నవ్వుతు సెల్ఫీలు తీసుకున్నాడు. అక్కడ ఉన్న సిబ్బంది చూసి పట్టుకొనేలోపు అక్కడి నుంచి పారిపోయాడు. అయితే ఈ ఘటనపై భయపడిన కమెడియన్ కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆ ఆగంతకుడు ఎవరు అనేది కనిపెట్టే ప్రయత్నంలో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే అతడు రాజు శ్రీవాత్సవ వీరాభిమాని కావచ్చని మరికొందరు అభిప్రాయపడుతున్నారు.
Also Read
- Kangana Ranaut : నర్స్‌లను గ్లామర్ వృత్తిగా మార్చేశారు... డ్రెస్ కోడ్‌పై కంగనా రనౌత్ షాకింగ్ కామెంట్స్
- Peddi 4 days Collections : పెద్ది 4 డేస్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్.. జస్ట్ మిస్
- Rahul Ramakrishna : పవన్ కళ్యాణ్ పై అర్జున్ రెడ్డి యాక్టర్ విమర్శలు
- Tollywood : క్యాబ్ డ్రైవర్ని చితకబాదిన ఛత్రపతి సినిమా విలన్
తాజావార్తలు
-
CM Chandrababu: ఇప్పుడు రైతుల భూ రికార్డులను ఎవరూ ట్యాంపర్ చేయలేరు!
-
Praggnanandhaa: సీఎం విజయ్‌కు చెక్‌మేట్.. సత్కారంతో పాటు రూ.50 లక్షల నగదు బహుమతి.!
-
Jasprit Bumrah: ఐపీఎల్ పూర్తి సీజన్ ఆడుతాడు, భారత్ మ్యాచ్‌లు మాత్రం ఆడడా.. బుమ్రాపై మాజీ క్రికెటర్ ఫైర్!
-
ATM Withdrawals: ఏటీఎం నుంచి డబ్బు తీసేటప్పుడు ఈ తప్పులు చేస్తున్నారా.. మీ ఖాతా ఖాళీ అయ్యే ప్రమాదం ఉంది!
-
Vivo X Fold 6: ఏఐ ఫీచర్లు, న్యూ యూజర్ ఇంటర్ఫేస్తో.. వివో ఎక్స్ ఫోల్డ్ 6 త్వరలో విడుదల
ట్రెండింగ్
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Birth Rate: భారత్‌లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్‌కు చెక్ పెట్టండి.!
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!