HHVM : పవన్ కల్యాణ్ నటిస్తున్న హరిహర వీరమ్లలు జోష్ మొదలైంది. జూన్ 12న వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. వరుసగా ప్రమోషన్లు మొదలు పెట్టారు. తాజాగా మూడో సింగిల్ ను కూడా రిలీజ్ చేశారు. ఈ క్రమంలోనే డైరెక్టర్ జ్యోతికృష్ణ ఓ ఇంటర్వ్యూలో కీలక వ్యాఖ్యలు చేశారు. అసలు వీరమల్లు కథ ఏంటి.. దేన్ని బేస్ చేసుకుని ఉంటుందో తెలిపారు. ‘హరిహర వీరమల్లు పార్ట్-1 స్వార్డ్ వర్సెస్ స్పిరిట్ పేరుతో రిలీజ్ అవుతోంది. స్వార్డ్ అంటే ఖడ్గం అని అర్థం. అది బాబీ డియోల్ పాత్రలో చూపిస్తున్నాం. అలాగే స్పిరిట్ అంటే ధైర్యం. దానికి నిదర్శనమే పవన్ కల్యాణ్ పాత్ర. ఈ రెండింటి మధ్య జరిగే యుద్ధమే హరిహర వీరమల్లు మూవీ’ అని తెలిపారు.
Read Also : Beerla Ilaiah: నోరు అదుపులో పెట్టుకో.. కేటీఆర్ పై ఐలయ్య ఫైర్..!
వీరిద్దరి నడుమ వచ్చే యాక్షన్ సన్నివేశాలు ప్రేక్షకులను అబ్బురపరుస్తాయని చెప్పుకొచ్చారు జ్యోతికృష్ణ. పవన్ కల్యాణ్ పాత్ర కోసం చాలా కష్టపడ్డారని.. గత సినిమాలతో పోలిస్తే ఈ సినిమాలోనే ఆయన కష్టం ఎక్కువగా ఉంటుందన్నారు. యాక్షన్ సన్నివేశాల కోసం ఆయన చేసిన కసరత్తులు, హార్డ్ వర్క్ ఫలితం స్క్రీన్ మీద కనిపిస్తుందంటూ వివరించారు జ్యోతికృష్ణ.
పవన్ కల్యాణ్ నటిస్తున్న ఈ సినిమా ట్రైలర్ గురించి మరికొన్ని గంటల్లోనే అప్డేట్ ఇస్తారని తెలుస్తోంది. ఆ ట్రైలర్ తో అంచనాలు అమాంతం పెరగొచ్చనే టాక్ నడుస్తోంది. పవన్ నుంచి చాలా ఏళ్ల తర్వాత వస్తున్న సినిమా కాబట్టి అంచనాలు భారీగానే ఉన్నాయి. త్వరలోనే ఎగ్జిబిటర్ల సమస్యలపై కూడా చర్చలు జరపబోతున్నారు. కాబట్టి థియేటర్ల మూసివేత ఉండకపోవచ్చు.
Read Also : A22 x A6: హైదరాబాద్ చేరుకున్న అట్లీ.. ఐకాన్‌స్టార్‌తో ప్రీ-ప్రొడక్షన్ డిస్కషన్స్