డాకు మహరాజ్ సక్సెస్ ఈవెంట్‌లో సంగీత దర్శకుడు తమన్ తెలుగు సినిమా గురించి మాట్లాడుతూ ఎమోషనల్ అయిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై మెగాస్టార్ చిరంజీవి ఎక్స్ వేదికగా స్పందిస్తూ ‘నిన్న నువ్వు మాట్లాడిన మాటలు హృదయాల్ని తాకేలా ఉన్నాయి. ఎప్పుడూ సరదాగా మాట్లాడుతూ వుండే నీలో ఇంత ఆవేదన వుండడం నాకు ఒకింత ఆశ్చర్యంగా కూడా అనిపించింది. కానీ మనసు ఎంత కలత చెందితే నువ్వింతగా స్పందించావో అని అనిపించింది. విషయం సినిమా అయినా, క్రికెట్ అయినా, మరో సామజిక సమస్య అయినా సోషల్ మీడియా వాడుతున్న ప్రతి ఒక్కరు తమ మాటల తాలూకు ప్రభావం ఆ వ్యక్తుల మీద ఎలా వుంటుందని ఆలోచించాలి. ఎవరో అన్నట్టు మాటలు ఫ్రీ నే. మాటలు స్ఫూర్తినిస్తాయి. మళ్లీ అవే మాటలు నాశనం చేయగలవు. మీరు ఏమి చేయాలనుకుంటున్నారో ఎంచుకోండి. మనం పాజిటివ్‌గా వుంటే ఆ ఎనర్జీ మన జీవితాలని కూడా అంతే పాజిటివ్‌గా ముందుకు నడిపిస్తుంది. గాడ్ బ్లెస్ యూ తమన్’ అంటూ చిరు రాసుకొచ్చారు.
Also Read : Manchu Family : జిల్లా అదనపు కలెక్టర్ తో ముగిసిన మంచు మనోజ్ వివరణ
ఇక చిరు ట్వీట్‌కు తమన్ రిప్లై ఇస్తూ ‘మీ మాటలు నాకు జీవితాంతం గుర్తు ఉంటాయి.. అంటూ రాసుకొచ్చాడు. ‘డియర్ అన్నయ్యా.. మీ మాటలు నాకు కర్మణ్యే వాధికారస్తే మా ఫలేషు కదాచన..! భగవద్గీత శ్లోకాన్ని గుర్తు చేశాయి. ఎంత కాదనుకున్నా మనుషులం కదా. ఒక్కోసారి ఆవేదన గుండె తలుపులు దాటి వచ్చేస్తూ ఉంటుంది. పేగు తెంచుకొని పుట్టిన బిడ్డని కళ్ళు తెరిచే లోపలే చిదిమేస్తుంటే వచ్చిన బాధ అది. నన్ను అర్థం చేసుకొని స్పందించిన మీ మాటలు నాకు జీవితాంతం గుర్తు ఉంటాయి..’ అని రాసుకొచ్చాడు. ప్రస్తుతం చిరు, తమన్ ట్వీట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
❤️❤️❤️❤️❤️❤️❤️❤️ @KChiruTweets 🥁 ✊
డియర్ అన్నయ్యా… మీ మాటలు నాకు
కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన….
అన్న భగవద్గీత శ్లోకాన్ని గుర్తు చేశాయి.ఎంత కాదనుకున్నా మనుషులం కదా… ఒక్కోసారి ఆవేదన గుండె తలుపులు దాటి వచ్చేస్తూ ఉంటుంది.
పేగు తెంచుకుని పుట్టిన బిడ్డని… కళ్ళు… https://t.co/Z8ueYVXFUG— thaman S (@MusicThaman) January 18, 2025