తన ఆస్తుల్లో ఉన్నవారిని ఖాళీ చేయించాలని, జల్‌పల్లిలోని తన ఆస్తులను కొందరు ఆక్రమించుకున్నారని వాళ్లను ఖాళీ చేయించి ఆస్తులను తమకు అప్పగించాలని జిల్లా మెజిస్ట్రేట్‌కి మోహన్ బాబు ఫిర్యాదు చేసారు. సీనియర్ సిటిజన్ యాక్ట్ ప్రకారం తన ఆస్తులను తనకు వచ్చేలా చూడాలని కోరారు. మోహన్ బాబు ఆస్తులపై పోలీసుల నుంచి నివేదిక తీసుకున్న కలెక్టర్ జల్‌పల్లి ఇంటిలో ఉంటున్న మనోజ్‌కు నోటీసులు ఇచ్చారు. ఈ నేపద్యంలో ఇబ్రహీంపట్నం మండలం కొంగర కాలన్ లో జిల్లా సమీకృత కార్యాలయం కు మంచు మనోజ్ వెళ్లి జిల్లా అదనపు కలెక్టర్ ప్రతిమ సింగ్ ను కలిసాడు మనోజ్.
అనంతరం మీడియాతో మాట్లాడుతూ ‘మా ప్రాపర్టీ లో ఉంటున్న మంచు విష్ణు ని అక్కడి నుంచి చట్టపరంగా తొలగించాలని జిల్లా మేజిస్ట్రేట్ను ఆశ్రయించిన మోహన్ బాబు తరపున మంచు మనోజ్. సీనియర్ సిటిజన్ ఆక్ట్ ప్రకారం మహేశ్వరం మండలంలోని జెల్ పల్లిలో ఉన్న ఆస్తి మా నాన్న స్వరాజీతం. పూర్తి వివరాలు జిల్లా అదనపు కలెక్టర్ కి తెలిపాను. అడగిన అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పాను. జాల్ పల్లి ఆస్తి విషయాల్లో నేను అక్రమంగా ఎంటర్ కాలేదు. కూర్చుని మాట్లాడుకుందాం అని చెప్పాను. నేను పారిపోవడం లేదు. ఎప్పుడు పిలిచినా వస్తాను. ఆస్తి విషయాల్లో నేను ఏం తప్పు చేయలేదు. తిరుపతి యూనివర్సిటీ లో జరిగిన తగాదాల్లో ప్రశ్నించినందుకు నన్ను టార్గెట్ చేసారు. విష్ణు నా తండ్రిని అడ్డం పెట్టుకొని ఆడుతున్న నాటకం ఇదంతా. నాకు నా తండ్రికి ఆస్తి తగాదాలు కాలేదు. టోటల్ ఎపిసోడ్ లో దొంగలు ఎవరో ప్రజలు అందరికీ తెలుసు. ఆ రోజు జెల్ పల్లి లో ఉన్న నా ఇంటికి నన్ను రానివ్వ లేదు. ఇంట్లో బయట యూనివర్శిటీ స్టూడెంట్స్ కోసం నేను నిలబడ్డాను. నాపై ఫాల్స్ తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. నాన్నని నేను ఎప్పుడూ వ్యతిరేకించను. కలెక్టర్ ఆదేశాలనుసారం నడుచుకుంటాను. నాకు న్యాయం జరగాలి అని జిల్లా అదనపు కలెక్టర్ ను కోరాను’ అని అన్నారు.