Yash’s Toxic: యశ్‌కి అగ్నిపరీక్ష.. ‘టాక్సిక్’ ముందు ఏకంగా రూ.1000 కోట్ల టార్గెట్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Yash’s Toxic: రాకింగ్ స్టార్ యశ్ నటించిన ‘టాక్సిక్’పై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు ఉన్నాయి. ‘కేజీఎఫ్’, ‘కేజీఎఫ్ 2’ చిత్రాలతో పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగిన యశ్.. ఇప్పుడు ‘టాక్సిక్’తో మరోసారి బాక్సాఫీస్‌ను షేక్ చేసేందుకు రంగంలోకి దిగారు. గీతూ మోహన్‌దాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ పీరియాడిక్ గ్యాంగ్‌స్టర్ డ్రామా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నిజానికి కన్నడ చిత్ర పరిశ్రమలో రూ.1000 కోట్ల మార్క్‌ను అందుకున్న సినిమాలు చాలా తక్కువ. ఇప్పటివరకు ‘కేజీఎఫ్ 2’ మాత్రమే ఆ మైలురాయిని దాటి భారీ విజయాన్ని నమోదు చేసింది. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ.1200 కోట్లకు పైగా వసూళ్లు సాధించి శాండల్‌వుడ్ స్థాయిని పాన్ ఇండియా మార్కెట్లో మరో స్థాయికి తీసుకెళ్లింది. గతేడాది ‘కాంతార: చాప్టర్ 1’ కూడా రూ.1000 కోట్లకు చేరువగా వెళ్లి ఆ మైలురాయిని అందుకోలేకపోయింది.
ఇప్పుడు దాదాపు రూ.500 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ‘టాక్సిక్’ ముందు కూడా ఇదే స్థాయి టార్గెట్ ఉందనే చర్చ జరుగుతోంది. ముఖ్యంగా ‘కేజీఎఫ్ 2’ తర్వాత మూడేళ్ల గ్యాప్‌తో యశ్ నుంచి వస్తున్న సినిమా కావడంతో ఈ చిత్రంపై అంచనాలు మరింత పెరిగాయి. యశ్ గత చిత్రాల మాదిరిగానే ఈ మూవీ కూడా భారీ వసూళ్లు సాధిస్తుందా అన్న ఇప్పుడు మిలియన్ డాలర్ ప్రశ్నగా మారింది. అయితే ‘టాక్సిక్’ విషయంలో మరో ఆసక్తికరమైన అంశం కూడా ఉంది. ‘కేజీఎఫ్’ చిత్రాలను చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా చాలామంది ప్రేక్షకులు ఎంజాయ్ చేశారు. కానీ ‘టాక్సిక్’కు ‘A’ సర్టిఫికెట్ రావడం, సినిమాలో హింస, రొమాన్స్ ఎక్కువగా ఉండటం వల్ల కుటుంబ ప్రేక్షకులు, ముఖ్యంగా యువతులు, మహిళలు ఏ స్థాయిలో థియేటర్లకు వస్తారన్నది కీలకంగా మారింది. సినిమాలో నయనతార, కియారా అద్వానీ, రుక్మిణి వసంత్, హ్యూమా ఖురేషి, తారా సుతారియా వంటి పలువురు హీరోయిన్స్ నటించారు. దీంతో గ్లామర్, యాక్షన్, గ్యాంగ్‌స్టర్ అంశాలతో ఈ సినిమాపై ఆసక్తి మరింత పెరిగింది. పాన్ ఇండియా స్థాయిలోనే కాకుండా అంతర్జాతీయ మార్కెట్లలోనూ ‘టాక్సిక్’ను మేకర్స్ భారీ స్థాయిలో రిలీజ్ చేశారు. మరి ‘రాఖీ భాయ్’ మరోసారి బాక్సాఫీస్‌పై తన ఆధిపత్యాన్ని చూపించి ‘కేజీఎఫ్ 2’ రికార్డులను తిరగరాస్తాడా? రూ.1000 కోట్ల క్లబ్లో మరోసారి కన్నడ సినిమా జెండా ఎగురవేస్తుందా? తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.
Also Read
- King 100 Glimpse: నాగార్జున 100వ సినిమా ఫస్ట్ గ్లింప్స్‌కు డేట్ ఫిక్స్.. ఆ రోజు అసలు సర్ప్రైజ్
- Pavan Sadineni Arrest: టాలీవుడ్ డైరెక్టర్ పవన్ సాదినేని అరెస్ట్.. లైంగికంగా వాడుకున్నాడని ఫిర్యాదు!
- Ram Charan: రవితేజ ‘ఇరుముడి’కి రామ్ చరణ్ అభినందనలు.. స్వామి శరణం అంటూ!
- Kriti Sanon: కృతి సనన్ రక్షాబంధన్ యాడ్ వివాదం.. దెబ్బకి యాడ్ వీడియో డిలీట్
తాజావార్తలు
-
Yash’s Toxic: యశ్‌కి అగ్నిపరీక్ష.. ‘టాక్సిక్’ ముందు ఏకంగా రూ.1000 కోట్ల టార్గెట్!
-
YS Jagan: ‘సీఎంగా ఏం చేస్తున్నా’ అని చంద్రబాబు ప్రశ్నించుకోవాలి.. వైఎస్ జగన్ ఫైర్!
-
Konda Murali: కొండా సురేఖ ఎపిసోడ్‌పై రాయబారం.. భట్టి విక్రమార్కతో కొండా మురళి భేటీ..
-
iPhone 18 Proలో అదిరిపోయే అప్‌గ్రేడ్స్.. రిలీజ్ డేట్, కలర్స్, బ్యాటరీ, కెమెరా, ధర పూర్తి వివరాలు ఇవే..
-
King 100 Glimpse: నాగార్జున 100వ సినిమా ఫస్ట్ గ్లింప్స్‌కు డేట్ ఫిక్స్.. ఆ రోజు అసలు సర్ప్రైజ్
ట్రెండింగ్
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ ఖరారు.. ఇద్దరు స్టార్ ఆటగాళ్లను వదులుకుంటున్న కేకేఆర్?
-
Raksha Bandhan 2026: రక్షాబంధన్ ఎప్పుడు? ఆగస్టు 27నా.. 28నా? శుభముహూర్తం, పూర్తి వివరాలు ఇవే..
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్‌తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్‌చేస్తే..
-
144Hz డిస్ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!