Shah Rukh Khan: ‘కింగ్’ ఎంట్రీ సీన్‌పై మైండ్ బ్లోయింగ్ లీక్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Shah Rukh Khan: ‘పఠాన్’, ‘జవాన్’ సినిమాలతో బాక్సాఫీస్‌ను షేక్ చేసిన బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్.. ఇప్పుడు ‘కింగ్’ సినిమాతో రాబోతున్నాడు. ఈ క్రేజీ ప్రాజెక్ట్ గురించి నెట్టింట రోజుకో అదిరిపోయే ముచ్చట బయటకు వస్తూనే ఉంది. తాజాగా ఈ సినిమాలో షారుఖ్ ఎంట్రీ సీన్‌కు సంబంధించి లీకైన ఓ న్యూస్ ఫ్యాన్స్‌ను పిచ్చెక్కిస్తోంది. ఇప్పటివరకు మన ఇండియన్ స్క్రీన్ మీద ఎవరూ ట్రై చేయని రేంజ్లో బాద్షా ఇంట్రడక్షన్ సీన్ ఉండబోతోందట. డైరెక్టర్ సిద్దార్థ్ ఆనంద్ ఈ సినిమాలో షారుఖ్ మొదటిసారి కనిపించే సీన్‌ను ఓ రేంజ్లో చెక్కాడట. స్క్రీన్ మీద బాద్షా కనిపించగానే విజిల్స్ పడేలా, కళ్లు తిప్పుకోలేని స్టైల్‌తో పాటు విపరీతమైన రఫ్ అండ్ డేంజరస్ లుక్‌తో ఆ సీన్ ఉంటుందట.
ఎప్పుడూ చూసే రొటీన్ ఫైట్లలా కాకుండా, థియేటర్లో కూర్చున్న ప్రతి ఒక్కరికీ రోమాలు నిక్కబొడుచుకునేలా ఈ సీన్ డిజైన్ చేశారని టాక్. ఇండియన్ యాక్షన్ సినిమాల్లోనే ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ సీన్‌గా నిలుస్తుందని యూనిట్ వర్గాలు తెగ నమ్మకంగా చెబుతున్నాయి. ఇక ఈ సినిమా టీజర్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్న ఫ్యాన్స్‌కు నవంబర్ 2న అసలైన ట్రీట్ ఇవ్వబోతున్నారట. సరిగ్గా షారుఖ్ బర్త్‌డే రోజే ఈ సినిమా టీజర్‌ను దించి బాక్సాఫీస్ దగ్గర అసలైన వేట మొదలుపెట్టాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారని ప్రచారం జరుగుతుంది. చూడాలి మరి బాలీవుడ్ బాద్షా బర్త్ డేకి మేకర్స్ ఎలాంటి సర్ప్రైజ్ ఇస్తారో అనేది.
Also Read
తాజావార్తలు
-
Shah Rukh Khan: ‘కింగ్’ ఎంట్రీ సీన్‌పై మైండ్ బ్లోయింగ్ లీక్!
-
Neha Bora: నేహా బోరాకు ఢిల్లీ పోలీస్ నోటీసులు.. అక్టోబర్ 29 వరకే గడువు.!
-
RBI Repo Rate: ఆర్బీఐ నుంచి భారీ షాక్.? రెపో రేటు పెంపుపై కీలక అంచనా.!
-
Trivikram: వెంకటేష్ ‘ఆదర్శ కుటుంబం’పైనే గురూజీ ఆశలన్నీ!
-
Pakistan LPG Crisis: పాకిస్థాన్‌లో గ్యాస్ సంక్షోభం.. సిలిండర్ ధర రూ.8,000 దాటింది!
ట్రెండింగ్
-
Humanoid Robot : కత్తి దాడినే అడ్డుకుంది.. చైనా రోబో విన్యాసాలు చూస్తే మైండ్ బ్లాక్
-
Incredible India : ప్రపంచ రికార్డుల ఖజానా.. భారత్‌లో ఈ ప్రదేశాలు చూశారా.?
-
Spine Health : చిన్న అలవాట్లే వెన్నెముకకు ముప్పు.. మీ పొజిషన్స్ సరిగ్గా లేకపోతే ఇబ్బందే
-
Bottle Gourd Roti Recipe: సొరకాయతో టేస్టీ రోటీలు.. బ్రేక్‌ఫాస్ట్‌కు అదిరిపోయే హెల్తీ రెసిపీ..
-
Shreyas Iyer History: మరో 25 పరుగులే.. మొదటి టీమిండియా కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ చరిత్ర!