Saudi Arabia flight update: సౌదీ అరేబియాలో ఉద్రిక్తతలు.. రియాద్ ఎయిర్‌పోర్ట్‌లో T1, T2 టెర్మినళ్లు పునఃప్రారంభం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Saudi Arabia flight update: సౌదీ అరేబియా, యెమెన్‌కు చెందిన హౌతీ తిరుగుబాటుదారుల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. సౌదీ అరేబియాలోని పలు కీలక ప్రాంతాలపై దాడులు చేసినట్లు హౌతీలు ప్రకటించడంతో విమాన సర్వీసులపై ప్రభావం పడింది. ఈ నేపథ్యంలో రియాద్‌లోని కింగ్ ఖాలిద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో టెర్మినల్-1, టెర్మినల్-2 నుంచి ఆదివారం (అక్టోబర్ 25) నుంచి విమాన సర్వీసులను తిరిగి ప్రారంభించనున్నట్లు విమానాశ్రయ అధికారులు ప్రకటించారు. ప్రయాణికుల కోసం ట్రావెల్ అడ్వైజరీని కూడా జారీ చేశారు.
విమానాశ్రయ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. టెర్మినల్-1 నుంచి దేశీయ విమాన సర్వీసులు నడవనున్నాయి. టెర్మినల్-2ను జాతీయ విమానయాన సంస్థల అంతర్జాతీయ విమానాల కోసం కేటాయించారు. ప్రయాణికులు విమానాశ్రయానికి బయలుదేరే ముందు తమ విమానయాన సంస్థను సంప్రదించి బుకింగ్ వివరాలు, విమాన సమయాలు, సర్వీసుల స్థితిని నిర్ధారించుకోవాలని అధికారులు సూచించారు.
Also Read
- Pakistan Minister: తాజ్ మహల్, నిజాముద్దీన్ దర్గాకు వెళ్లాలనుకున్న పాక్ మంత్రి.. ‘నో’ చెప్పిన భారత్..
- Iran War: ఇరాన్‌పై 7 రోజుల వైమానిక దాడులకు ప్లాన్? ట్రంప్ నిర్ణయం కోసం నెతన్యాహు ఎదురుచూపులు
- Trump, Putin, Xi Jinping Meet: ట్రంప్, పుతిన్, జిన్‌పింగ్ చారిత్రాత్మక భేటీ.. 5 కీలక విషయాలు ఇవే!
- Bangladesh: భారత్ నుంచే చుక్కలు చూపిస్తున్న హసీనా.. బంగ్లాదేశ్‌లో లాక్డౌన్!
హౌతీ సైనిక ప్రతినిధి యాహ్యా సారీ గతంలో సౌదీ అరేబియాలోని పలు కీలక ప్రాంతాలను లక్ష్యంగా చేసుకున్నట్లు ప్రకటించారు. రియాద్‌లోని కింగ్ ఖాలిద్ అంతర్జాతీయ విమానాశ్రయం, యాన్బూలోని అరామ్కో సదుపాయం, రబిగ్ రిఫైనరీ, ఈస్ట్- వెస్ట్ చమురు పైప్‌లైన్‌పై దాడులు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. అలాగే దమ్మామ్‌లోని కింగ్ ఫహద్ అంతర్జాతీయ విమానాశ్రయం, నజ్రాన్ విమానాశ్రయం, ఖమీస్ ముషైత్ వైమానిక స్థావరాన్ని కూడా లక్ష్యంగా చేసుకున్నట్లు హౌతీలు ప్రకటించారు.
సౌదీ అరేబియాలో మారుతున్న భద్రతా పరిస్థితుల నేపథ్యంలో ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ కొన్ని విమాన సర్వీసులను తాత్కాలికంగా నిలిపివేసినట్లు సమాచారం. ప్రభావిత ప్రయాణికులకు ఉచితంగా ప్రయాణ తేదీ మార్చుకునే అవకాశం లేదా పూర్తి రీఫండ్ అందించే విధానాన్ని ప్రకటించింది. ఈ అడ్వైజరీ ప్రకారం, రియాద్, దమ్మామ్ నుంచి రాకపోకలు సాగించే విమాన సర్వీసులపై నవంబర్ 7 వరకు, జెడ్డాకు సంబంధించిన సర్వీసులపై అక్టోబర్ 31 వరకు నిలుపుదల ప్రభావం ఉండనున్నట్లు సమాచారం.
రియాద్ విమానాశ్రయంలోని రెండు టెర్మినళ్ల నుంచి విమాన సర్వీసులు తిరిగి ప్రారంభమవుతున్నప్పటికీ, ప్రాంతీయ భద్రతా పరిస్థితుల కారణంగా విమానాల షెడ్యూల్లో మార్పులు జరిగే అవకాశం ఉంది. అందువల్ల ప్రయాణికులు విమానాశ్రయానికి వెళ్లే ముందు ఈ జాగ్రత్తలు పాటించాలి:
తమ విమానయాన సంస్థ నుంచి తాజా సమాచారం తెలుసుకోవాలి.
విమాన సమయం, టెర్మినల్ వివరాలు, బుకింగ్ స్థితిని నిర్ధారించుకోవాలి.
విమానం రద్దయినా లేదా ఆలస్యమైనా, రీబుకింగ్, రీఫండ్ నిబంధనలను తెలుసుకోవాలి.
అధికారిక విమానాశ్రయ ప్రకటనలు, ప్రభుత్వ ప్రయాణ సూచనలను అనుసరించాలి.
తాజావార్తలు
-
World Hello Day 2026 : ఒక్క ‘హలో’తో ఇన్ని లాభాలా?.. నవంబర్ 21 ప్రత్యేకత ఇదే.!
-
OTR : బంగారం, వెండి ధరలు ఎందుకు తగ్గుతున్నాయి? విలువైన లోహాల భవిష్యత్తు ఎలా ఉండబోతోంది?
-
Warangal Projects : వరంగల్‌కు భారీ ప్రాజెక్టులు.. సీఎం రేవంత్ కీలక సమీక్ష
-
Koti Deepotsavam 2026 : త్రిశక్తి మహాపూజ, జోగులాంబ కల్యాణంతో ఎన్టీఆర్ స్టేడియంలో భక్తి పారవశ్యం.!
-
Telangana Congress : MLA రాజగోపాల్ రెడ్డి అసంతృప్తి వెనుక అసలు కారణమేంటి?
ట్రెండింగ్
-
Smart Shopping : కొత్త బట్టల మోజుకు బ్రేక్.. మహిళల కొత్త ఫ్యాషన్ ఇదే
-
Glenn Phillips Record: మూడు ఫార్మాట్లు, ఒకే ప్రత్యర్థి, ఒకే ఏడాది.. చరిత్ర సృష్టించిన గ్లెన్ ఫిలిప్స్!
-
Glenn Phillips Record: మరో 6 పరుగులే.. అంతర్జాతీయ క్రికెట్లోనే మొదటి ఆటగాడిగా ఫిలిప్స్ చరిత్ర!
-
MS Dhoni Retirement: ఆడాలని ఎంతో ప్రయత్నించాడు కానీ.. ఎంఎస్ ధోనీ రిటైర్మెంట్పై రైనా కీలక వ్యాఖ్యలు!
-
150 కి.మీ. రేంజ్, బ్యాటరీ స్వాపింగ్ సదుపాయంతో భారత్‌లోకి VinFast ఎలక్ట్రిక్ స్కూటర్లు..!