Congress Delhi Rally: నవంబర్ 1న ఢిల్లీలో కాంగ్రెస్ భారీ ర్యాలీ.. 10 లక్షల మంది వస్తారని పార్టీ ప్రకటన..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Congress Delhi Rally: కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ (CEC) జ్ఞానేశ్ కుమార్‌ను వెంటనే ఆ పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తూ నవంబర్ 1న ఢిల్లీ వేదికగా నిర్వహించబోయే ‘ఇండియా’ (INDIA) కూటమి ర్యాలీకి దాదాపు 10 లక్షల మంది హాజరవుతారని కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. ఈ మేరకు శనివారం హర్యానా కాంగ్రెస్ ఇన్ఛార్జ్ సంజయ్ దత్, రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు రావు నరేంద్ర సింగ్ పీటీఐ (PTI) వార్తా సంస్థకు వెల్లడించారు. దేశ ప్రజాస్వామ్యానికి ఓటర్ల జాబితా పారదర్శకత, ప్రతీ పౌరుడికి ఉండే ఓటు హక్కు పరిరక్షణ అత్యంత కీలకమని, ఈ విషయాల్లో కాంగ్రెస్ ఎలాంటి రాజీ పడబోదని తేల్చిచెప్పారు. ఎలక్షన్ కమిషన్ వ్యవహరిస్తున్న తీరు, ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణలో జరుగుతున్నాయంటున్న అక్రమాలకు నిరసనగా కాంగ్రెస్ చేపట్టిన ‘ఓట్ బచావో-దేశ్ బచావో’ ప్రచారం ఇప్పుడు తుది దశకు చేరుకుందని తెలిపారు. ఢిల్లీలోని చారిత్రాత్మక రామ్‌లీలా మైదానంలో జరగనున్న ఈ ర్యాలీ దీనికి ముగింపు కానుందని పేర్కొన్నారు. ‘ఓట్ల చోరీ’కి వ్యతిరేకంగా సాగే ఈ మహా ప్రదర్శన ద్వారా ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని రక్షించుకోవడానికి తామంతా ఏకతాటిపై ఉన్నామనే బలమైన సందేశాన్ని ఇస్తామని కాంగ్రెస్ నాయకులు స్పష్టం చేశారు.
ఈ ర్యాలీని విజయవంతం చేసేందుకు హర్యానా వ్యాప్తంగా జిల్లాల నుంచి గ్రామాలు, పోలింగ్ బూత్‌ల స్థాయి వరకు విస్తృతంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఓటర్ల జాబితాలో నమోదైన తప్పులను, పొరపాట్లను పత్రాలతో సహా నమోదు చేయాలని, ఓటు హక్కుపై ప్రజల్లో అవగాహన పెంచి నవంబర్ 1 నాటి ర్యాలీకి భారీగా జన సమీకరణ చేయాలని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ఎలక్షన్ కమిషన్‌ను నిష్పాక్షికంగా నడపడం ఒక రాజ్యాంగబద్ధమైన బాధ్యత అని, అర్హులైన పౌరుల పేర్లను తొలగించడంపై వస్తున్న ఆరోపణలను తేలిగ్గా తీసుకోలేమని సంజయ్ దత్ అభిప్రాయపడ్డారు. ప్రస్తుత జ్ఞానేశ్ కుమార్ పదవిలో ఉన్నంత కాలం పారదర్శకమైన ఎన్నికల ప్రక్రియ సాధ్యం కాదని, అందుకే ఆయనను పదవి నుంచి తొలగించడం తప్పనిసరి అని కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేశారు. ఒకవేళ విచారణలో ఆయన ప్రజాస్వామ్య వ్యవస్థను బలహీనపరిచారని లేదా చట్టాన్ని ఉల్లంఘించారని తేలితే ఆయనను అరెస్టు చేయడంతో పాటు కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ఈ పోరాటం ఏదో ఒక రాజకీయ పార్టీ కోసం కాదని, స్వేచ్ఛాయుతమైన ఎన్నికలలో ప్రజలు తమ ప్రభుత్వాన్ని ఎన్నుకునే ప్రాథమిక రాజ్యాంగ హక్కును రక్షించడం కోసమేనని వారు స్పష్టం చేశారు. ఈ ర్యాలీకి సంబంధించిన ఏర్పాట్లపై శుక్రవారం న్యూఢిల్లీలోని ఇందిరా భవన్లో కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ ఆధ్వర్యంలో హర్యానా కాంగ్రెస్ ముఖ్య నేతలతో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం కూడా జరిగింది.
Also Read
- Tilak Varma: ఆ ఒక్క టెక్నిక్ ఫాలో అయ్యాను.. అందుకే విజయం సాధించాం: తిలక్ వర్మ
- Hyderabad: భాగ్యనగరంలో గన్ కల్చర్ కలకలం.. పంజాగుట్ట బార్లో రివాల్వర్‌తో బెదిరింపులు..
- Heavy Rain Alert: తెలంగాణకు భారీ వర్ష సూచన.. ఈ మూడు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ..
- Tilak Varma: మ్యాచ్ గెలిచిన తర్వాత వర్మ వినూత్న సెలబ్రేషన్స్.. కౌంటర్ మాములుగా ఇవ్వలేదుగా..
తాజావార్తలు
-
Congress Delhi Rally: నవంబర్ 1న ఢిల్లీలో కాంగ్రెస్ భారీ ర్యాలీ.. 10 లక్షల మంది వస్తారని పార్టీ ప్రకటన..
-
Cyberabad SHE Teams: మహిళల రక్షణే ధ్యేయం.. సైబరాబాద్ ‘షీ టీమ్స్’ ప్రత్యేక నిఘా-185 డెకాయ్ ఆపరేషన్లు, 28 మంది పట్టివేత
-
Tilak Varma: ఆ ఒక్క టెక్నిక్ ఫాలో అయ్యాను.. అందుకే విజయం సాధించాం: తిలక్ వర్మ
-
Vivo S70: Visionox OLED డిస్ప్లే, 64MP కెమెరాతో Vivo S70 స్మార్ట్‌ఫోన్.. ఫీచర్లు లీక్!
-
Hyderabad: భాగ్యనగరంలో గన్ కల్చర్ కలకలం.. పంజాగుట్ట బార్లో రివాల్వర్‌తో బెదిరింపులు..
ట్రెండింగ్
-
Humanoid Robot : కత్తి దాడినే అడ్డుకుంది.. చైనా రోబో విన్యాసాలు చూస్తే మైండ్ బ్లాక్
-
Incredible India : ప్రపంచ రికార్డుల ఖజానా.. భారత్‌లో ఈ ప్రదేశాలు చూశారా.?
-
Spine Health : చిన్న అలవాట్లే వెన్నెముకకు ముప్పు.. మీ పొజిషన్స్ సరిగ్గా లేకపోతే ఇబ్బందే
-
Bottle Gourd Roti Recipe: సొరకాయతో టేస్టీ రోటీలు.. బ్రేక్‌ఫాస్ట్‌కు అదిరిపోయే హెల్తీ రెసిపీ..
-
Shreyas Iyer History: మరో 25 పరుగులే.. మొదటి టీమిండియా కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ చరిత్ర!