JSS Vardhan: ‘ది ట్రెయిటర్స్’లో ఆసక్తి రేకెత్తిస్తున్న టాలీవుడ్ డైరెక్టర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతున్న డిఫరెంట్ రియాలిటీ మైండ్ గేమ్ ‘ది ట్రెయిటర్స్’ (The Traitors) ప్రేక్షకుల ఊహలకు అందకుండా ఉత్కంఠభరితంగా సాగుతోంది. తేజ సజ్జా హోస్ట్ చేస్తున్న ఈ షోలో ఎవరు ఎవరిని నమ్మాలో, ఎప్పుడు ఎవరు ఎలిమినేట్ అవుతారో తెలియని సస్పెన్స్ అందరినీ కట్టిపడేస్తోంది. అయితే, హౌస్‌లోకి అడుగుపెట్టిన 20 మంది కంటెస్టెంట్లలో డైరెక్టర్, రైటర్ జే.ఎస్.ఎస్. వర్ధన్ హాట్ టాపిక్ అవుతున్నాడు. గీతా సుబ్రహ్మణ్యం, హలో వరల్డ్ లాంటి హిట్ వెబ్ సిరీస్‌లు, పలు సినిమాలు డైరెక్ట్ చేసిన జే.ఎస్.ఎస్. వర్ధన్ ఇప్పుడు ఈ షోలో తన మాస్టర్ స్ట్రాటజీలతో హౌస్‌లోకి రాకముందే చిన్మయిని ‘ఫిల్టర్ లెస్ ఫేస్’ అని ఎంచుకోవడం, గౌరవ్ ట్రెయిటర్ కాదని నమ్మడం, తోటి కంటెస్టెంట్లు చిన్మయి, నిఖిల్, గౌరవ్‌లను ట్రెయిటర్స్ చంపేసినప్పుడు.. దానికి ప్రతీకారంగా విద్యుల్లేఖను ట్రెయిటర్గా గుర్తించి, ‘రింగ్ ఆఫ్ డౌట్’లో ఆమెను ఎలిమినేట్ చేయించడంతో వర్ధన్ గురించి చర్చ జరుగుతోంది.
ఇక తాజాగా స్ట్రీమింగ్ అయిన 6వ ఎపిసోడ్ ఎండింగ్ అయితే నెక్స్ట్ లెవెల్ సస్పెన్స్‌ను క్రియేట్ చేసింది. స్ట్రాంగ్ ప్లేయర్స్‌ను ట్రెయిటర్స్ టార్గెట్ చేస్తున్న సమయంలో హిట్ లిస్ట్‌లో ఉన్న వర్ధన్ ఏకంగా ట్రెయిటర్స్కే ఓపెన్ ఛాలెంజ్ విసిరాడు. “మై డియర్ ట్రెయిటర్… దమ్ముంటే ఈరోజు రాత్రి నన్ను బతికించు! రేపు మాత్రం నేను నిన్ను చంపేస్తా!!” అంటూ అతను ఇచ్చిన వార్నింగ్ హౌస్‌లో కాక రేపుతోంది. మిషన్‌లో కూడా ఎవరూ అతన్ని కాపాడలేకపోవడంతో.. ఇప్పుడు వర్ధన్, శ్రావ్య, ధనుంజయ్‌లు ఆషికా కత్తికి దగ్గరయ్యారు. మరి వర్ధన్ ఎలిమినేట్ అవుతాడా? లేదా తన మైండ్ గేమ్‌తో ట్రెయిటర్స్ను మట్టికరిపిస్తాడా? అనే ఉత్కంఠకు తెరపడాలంటే వచ్చే గురువారం కొత్త ఎపిసోడ్ వచ్చే వరకు వేచి చూడాల్సిందే!
Also Read
తాజావార్తలు
-
JSS Vardhan: ‘ది ట్రెయిటర్స్’లో ఆసక్తి రేకెత్తిస్తున్న టాలీవుడ్ డైరెక్టర్
-
మెగా ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్.. RC 17 షురూ అయ్యేది ఎప్పుడంటే?
-
Basara IIIT : బాసర ట్రిపుల్ ఐటీ అకాడమిక్ షెడ్యూల్ విడుదల.. అక్టోబర్ 26 నుంచి ఆన్లైన్ క్లాసులు
-
Mythri Ravi : ‘ఫౌజీ’, ‘డ్రాగన్’ రిలీజ్‌లపై వెనక్కి తగ్గేదే లేదు.. నాగార్జున కామెంట్స్‌ను సీరియస్‌గా తీసుకుకున్నాం
-
OTR: ముగ్గురు మంత్రులు.. ముగ్గురు వారసులు! నెక్స్ట్ ప్లాన్ ఏంటి?
ట్రెండింగ్
-
Humanoid Robot : కత్తి దాడినే అడ్డుకుంది.. చైనా రోబో విన్యాసాలు చూస్తే మైండ్ బ్లాక్
-
Incredible India : ప్రపంచ రికార్డుల ఖజానా.. భారత్‌లో ఈ ప్రదేశాలు చూశారా.?
-
Spine Health : చిన్న అలవాట్లే వెన్నెముకకు ముప్పు.. మీ పొజిషన్స్ సరిగ్గా లేకపోతే ఇబ్బందే
-
Bottle Gourd Roti Recipe: సొరకాయతో టేస్టీ రోటీలు.. బ్రేక్‌ఫాస్ట్‌కు అదిరిపోయే హెల్తీ రెసిపీ..
-
Shreyas Iyer History: మరో 25 పరుగులే.. మొదటి టీమిండియా కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ చరిత్ర!