మెగా ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్.. RC 17 షురూ అయ్యేది ఎప్పుడంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
RC 17: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్లో రాబోతున్న ‘RC 17’ కోసం సినీ లవర్స్ ఎంత ఆత్రుతగా ఎదురుచూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ‘రంగస్థలం’ లాంటి రికార్డ్ బ్రేకింగ్ హిట్ తర్వాత వస్తున్న సినిమా కావడంతో అనౌన్స్మెంట్ వచ్చినప్పటి నుంచే దీనిపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. అయితే ఈ సినిమా పూజా కార్యక్రమాలు ఎప్పుడుంటాయనే దానిపై చాలా రోజులుగా సస్పెన్స్ కొనసాగుతోంది. తాజాగా ఈ సస్పెన్స్‌కు ఎండ్ కార్డ్ వేస్తూ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ అధినేత వై.రవిశంకర్ ఓ అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు.
నిజానికి దసరా రోజే ‘RC 17’ ప్రాజెక్ట్‌ను పూజా కార్యక్రమాలతో గ్రాండ్‌గా లాంచ్ చేయాలని ప్లాన్ చేశారు. కానీ ఆ టైమ్‌లో మూఢం ఉండటంతో మంచి ముహూర్తం కోసం ఓపెనింగ్‌ను కాస్త ముందుకు జరపాల్సి వచ్చింది. ఆ తర్వాత అక్టోబర్ 26 లేదా 27న పూజ ఉంటుందని మైత్రీ రవి గతంలో హింట్ ఇచ్చారు. అయితే తాజాగా ‘418’ సినిమా మీడియా మీట్లో మాట్లాడిన ఆయన.. ఫైనల్ డేట్‌ను రివీల్ చేశారు. నవంబర్ 1వ తేదీన అధికారికంగా పూజా కార్యక్రమాలు నిర్వహించి ప్రాజెక్ట్‌ను పట్టాలెక్కిస్తున్నట్లు స్పష్టం చేశారు. ఓపెనింగ్ పూర్తయిన వెంటనే రెగ్యులర్ షూటింగ్‌కు సంబంధించిన పనులను కూడా శరవేగంగా మొదలుపెట్టబోతున్నట్లు తెలిపారు. వరుస వాయిదాల తర్వాత ఎట్టకేలకు ప్రాజెక్ట్ లాంఛింగ్‌కు గ్రీన్ సిగ్నల్ పడటంతో మెగా ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు.
Also Read
తాజావార్తలు
-
మెగా ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్.. RC 17 షురూ అయ్యేది ఎప్పుడంటే?
-
Basara IIIT : బాసర ట్రిపుల్ ఐటీ అకాడమిక్ షెడ్యూల్ విడుదల.. అక్టోబర్ 26 నుంచి ఆన్లైన్ క్లాసులు
-
Mythri Ravi : ‘ఫౌజీ’, ‘డ్రాగన్’ రిలీజ్‌లపై వెనక్కి తగ్గేదే లేదు.. నాగార్జున కామెంట్స్‌ను సీరియస్‌గా తీసుకుకున్నాం
-
OTR: ముగ్గురు మంత్రులు.. ముగ్గురు వారసులు! నెక్స్ట్ ప్లాన్ ఏంటి?
-
PV Sindhu : ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్లో పి.వి.సింధు.. మరో సూపర్ 750 టైటిల్‌పై కన్ను
ట్రెండింగ్
-
Humanoid Robot : కత్తి దాడినే అడ్డుకుంది.. చైనా రోబో విన్యాసాలు చూస్తే మైండ్ బ్లాక్
-
Incredible India : ప్రపంచ రికార్డుల ఖజానా.. భారత్‌లో ఈ ప్రదేశాలు చూశారా.?
-
Spine Health : చిన్న అలవాట్లే వెన్నెముకకు ముప్పు.. మీ పొజిషన్స్ సరిగ్గా లేకపోతే ఇబ్బందే
-
Bottle Gourd Roti Recipe: సొరకాయతో టేస్టీ రోటీలు.. బ్రేక్‌ఫాస్ట్‌కు అదిరిపోయే హెల్తీ రెసిపీ..
-
Shreyas Iyer History: మరో 25 పరుగులే.. మొదటి టీమిండియా కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ చరిత్ర!