ఇప్పుడు మైథలాజికల్ వైబ్స్ ఉన్న సినిమాలు బాక్సాఫీస్‌ని షేక్ చేస్తున్నాయి. ఈ క్రేజీ ట్రెండ్‌లో జగన్నాధ పిక్చర్స్ బ్యానర్‌పై జగదీష్ ఆమంచి హీరోగా చేస్తూ స్వీయ డైరెక్షన్‌లో రూపొందించిన సినిమా ‘యముడు’. ఈ మూవీకి ట్యాగ్‌లైన్ ‘ధర్మో రక్షతి రక్షితః’. హీరోయిన్‌గా శ్రావణి శెట్టి రాక్ చేస్తోంది. తాజాగా మేకర్స్ ఈ సినిమా నుంచి కిల్లర్ పోస్టర్‌ని డ్రాప్ చేశారు. గతంలో రిలీజ్ అయిన ‘యముడు’ టైటిల్ పోస్టర్, దీపావళి స్పెషల్ పోస్టర్స్ అందరినీ ఫిదా చేశాయి. ఇప్పుడు మరో సూపర్ పవర్‌ఫుల్ పోస్టర్‌తో మేకర్స్ అదరగొట్టేశారు.
Sourav Ganguly: రంగంలోకి దాదా… PCB అడుక్కు తినాల్సిందే!
ఈ పోస్టర్‌లో జగదీష్ యముడి లుక్‌లో టోటల్‌గా భయపెట్టేస్తున్నాడు. వెనక ఉన్న మహిషాకారం, యముడి చేతిలో సంకెళ్లు… ఇవన్నీ గూస్‌బంప్స్ గ్యారెంటీ. హీరోయిన్‌ని యమపాశంతో బైండ్ చేసిన స్టైల్, యముడి గెటప్‌లో జగదీష్ కనిపించిన వైబ్ చూస్తే రోమాలు నిక్కబొడిచేలా ఉంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ అయిపోయింది. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్‌లో యూనిట్ ఫుల్ బిజీ. త్వరలోనే రిలీజ్ డేట్‌ని అఫీషియల్‌గా అనౌన్స్ చేయనున్నారు.