మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా, డైరెక్టర్ వశిష్ఠ తెరకెక్కిస్తున్న భారీ సోషియో ఫాంటసీ చిత్రం ‘విశ్వంభర’ పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలే నెలకొన్నాయి. ఇటీవల విడుదలైన టీజర్‌కు మంచి స్పందన రాగా, కొందరు ‘అవతార్’ కాపీ అంటూ విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే.ఈ నేపథ్యంలో దర్శకుడు వశిష్ఠ తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఈ విమర్శలపై కౌంటర్ ఇచ్చారు.
Also Raed : Tripti : ఆ పాత్రే నాకు ధైర్యం నేర్పింది..
“టీజర్ లో చిన్నారి పాప కాస్ట్యూమ్ చూసి ‘అవతార్’ కాపీ అని కామెంట్స్ చేస్తున్నారు. కానీ అలాంటి చెవులు, కొండలు ఎన్నో పాత సినిమాల్లో చూశాం. నేను అసలు స్ఫూర్తి తీసుకున్నది చందమామ కథలు. అందులో ‘జ్వాలాదీపం’ సిరీస్ గుర్తుందా? అవే కథల్లో ఉన్న యూనివర్స్‌ను రీఇమాజిన్ చేశా. అవతార్‌ను కాకుండా చందమామ కథలను కాపీ కొట్టారంటే నాకెంతో ఆనందం’ అని వ్యంగ్యంగా చెప్పారు. అంతేకాదు, మరో రూమర్‌పై కూడా వశిష్ఠ స్పష్టత ఇచ్చారు.
“విశ్వంభరలో ఐదుగురు హీరోయిన్లు ఉన్నారంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదు. మెయిన్ లీడ్‌గా త్రిష, రెండో కీలక పాత్రలో ఆషిక ఉన్నారు. ఇంకొంతమంది నటీమణులు ప్రత్యేక పాత్రలో కనిపిస్తారు. కానీ ఆ వార్తలు వాస్తవం కాదు. స్క్రీన్‌పై వీళ్లందరూ చాలా ఫ్రెష్‌గా కనిపించబోతున్నారు” అని చెప్పారు. వీఎఫ్‌ఎక్స్ వర్క్ కారణంగానే సినిమా విడుదల ఆలస్యమవుతోందని కూడా వశిష్ఠ స్పష్టం చేశారు.