బాలీవుడ్ టాలెంటెడ్ బ్యూటీ త్రిప్తి దిమ్రీ ‘ధడక్ 2’ చిత్రంతో మరోసారి ఆకట్టుకునేందుకు సిద్ధమవుతోంది. సిద్ధాంత్ చతుర్వేది సరసన ఆమె నటించిన ఈ ప్రేమకథా చిత్రానికి షాజియా ఇక్బాల్ దర్శకత్వం వహించారు. ఇందులో త్రిప్తి ‘విధి’ అనే పాత్రలో కనిపించనుంది.తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న త్రిప్తి, ఈ పాత్ర గురించి తనపై కలిగిన ప్రభావాన్ని వివరించింది.
Also Read : Sathileelavathi: ‘సతీ లీలావతి’ టీజర్‌కు టైమ్ ఫిక్స్.. ఎప్పుడంటే?
‘ ‘ధడక్ 2’ లోని విధి పాత్ర కారణం లేకుండా అంగీకరించలేదు.. ఆ పాత్ర ఎంతో ధైర్యవంతంగా ఉంటుంది. నిజం చెప్పడంలో భయపడదు. నిజ జీవితంలో నేను ఎంతో కొంత మౌనంగా ఉండే దాన్ని. ఎన్నో విషయాల్లో స్పందించలేక వెనకడుగేసేదాన్ని. కానీ ఈ పాత్ర నా ఆలోచనా విధానాన్ని మార్చేసింది. ఈ సినిమా పూర్తయ్యే సరికి, ఎవరికీ భయపడకుండా ధైర్యంగా మాట్లాడే గుణం నాలో ఏర్పడింది. విధిలా జీవించాలనే ఆలోచన, నాకు నా నిజమైన శక్తిని గుర్తు చేసింది. ఈ చిత్రం నా వ్యక్తిత్వాన్ని, కెరీర్‌ని కొత్త దారిలో నడిపించిందని నమ్ముతున్నా” అని త్రిప్తి పేర్కొంది. కాగా ఈ చిత్రంలో త్రిప్తి ప్రదర్శించబోయే భావోద్వేగాలు, ఆత్మవిశ్వాసం ప్రేక్షకులకు ఎంతవరకు కనెక్ట్ అవుతాయో చూడాలి. ఇప్పటికే ‘కలా’, ‘బుల్బుల్’, ‘ఎనిమీ’ వంటి చిత్రాలతో మంచి నటిగా పేరొందిన త్రిప్తి, ‘ధడక్ 2’ ద్వారా తన పరిధిని మరింత విస్తరించనున్నట్లు కనిపిస్తుంది.