బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్(అక్కి ) తాజా చిత్రం ‘సర్ఫిరా’. తమిళ హీరో సూర్య నటించిన ‘ఆకాశమే నీ హద్దురా’ కు అఫీషియల్ రీమేక్ సర్ఫిరా. ఒరిజినల్ కు దర్శకత్వం వహించిన సుధా కొంగర ఈ రీమేక్ కు దర్శకత్వం వహించింది. శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం అక్షయ్ ఫ్లాప్ ల పరంపరను కంటిన్యూ చేసిందని ట్రేడ్ వర్గాలు తెలిపాయి.
అక్షయ్ కుమార్ సినిమా అంటేనే ప్రేక్షకులు ముఖం చేస్తున్నారు. ‘సర్ఫిరా’ చిత్రానికి మినిమం ఓపెనింగ్ కూడా రాలేదంటే అక్కి సినిమాల పరిస్థితి అర్ధం అవుతోంది . ఇటీవల కాలంలో అక్షయ్ 11 చిత్రాలు రిలీజ్ అవగా ఒక హిట్టు ఒక యావరేజ్ తప్ప మిగిలిన సినిమాలు అన్ని దారుణంగా ఫ్లాప్ అయ్యాయి. దీంతో సొంత కథలు పక్కన పెట్టి రీమేక్ కథను ఎంచుకుని అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు అక్షయ్. కానీ ఫలితం మారలేదు. సర్ఫిరా థియేటర్లు అన్నీ ఖాళీగా దర్శనమిస్తున్నాయి. దీంతో మల్టీప్లెక్స్ థియేటర్ల యాజమాన్యాలు ఆఫర్స్ ప్రకటించాయి. సర్ఫిరా సినిమా చూడడానికి వచ్చే ప్రేక్షకులకు రెండు సమోసాలు, ఒక టీ ఉచితంగా అందిస్తున్నాయి.
సమోసా, టీ కోసం అంత రేట్ పెట్టి టికెట్ కొనాలా అని సోషల్ మీడియాలో నెటిజన్లు సెటైర్స్ వేస్తున్నారు. యదార్ధ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన సర్ఫిరా బాలీవుడ్ ప్రేక్షకులను ఆకట్టుకునేలా మార్పులు చేసారు. ఈ చిత్రంతో మినిమం హిట్ దక్కించుకుని ఫ్లాప్ జైత్రయాత్రకు బ్రేక్ ఇవ్వాలని, ఖచ్చితంగా హిట్ కొడతానని అక్షయ్ కుమార్ గట్టి నమ్మకంతో ఉన్నాడు, కానీ ఫలితం తేడా కొట్టింది. మరి ముఖ్యంగా నార్త్ అమెరికాలో అల్ టైమ్ డిజాస్టర్ దిశగా సాగుతోంది సర్ఫిరా. వరుస ఫ్లాప్ లు వచ్చినా కూడా అక్షయ్ చేతిలో ప్రస్తుతం 9 సినిమాలు ఉండడం ఆశ్చర్యమే.
Also Read: Director clash : నాగి vs సందీప్ బ్లడ్ వార్…ఇంతకీ తప్పెవరిది..?