Vishwak Sen: ‘కల్ట్’ వైల్డ్ రైడ్.. గుండె ధైర్యం ఉంటేనే థియేటర్‌కు రండి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vishwak Sen: సినిమా బాగుంది, అందరూ కుటుంబ సమేతంగా వచ్చి చూడండి అని చెప్పే హీరోలనే ఇప్పటివరకు చూశాం. కానీ “గుండెల్లో ధైర్యం ఉంటేనే నా సినిమా థియేటర్‌కు రండి.. పిల్లలు, వీక్ హార్టెడ్ పీపుల్ నా సినిమా చూడొద్దు” అంటూ ఓపెన్‌గా వార్నింగ్ ఇచ్చి టాలీవుడ్‌ను షేక్ చేశాడు మాస్ కా దాస్ విశ్వక్ సేన్. ఆయన ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన తాజా చిత్రం ‘కల్ట్’ రిలీజ్‌కు సిద్ధమైన వేళ, విశ్వక్ చేసిన ఈ బోల్డ్ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాయి.
తాజాగా నిర్వహించిన ఈ చిత్ర ప్రెస్ మీట్లో మాట్లాడిన విశ్వక్ సేన్, సినిమా స్వభావాన్ని సూటిగా వివరించారు. “నిన్న రాత్రే నేను ఫైనల్ కాపీ చూసుకున్నా. అందుకే అంత కాన్ఫిడెంట్‌గా చెబుతున్నా. ఇది రెగ్యులర్ కమర్షియల్ ఫార్మాట్లో, కేవలం నాలుగు రూపాయలు వెనకేసుకుందామని తీసిన సినిమా కాదు. కుదిరినన్ని ఎక్స్పెరిమెంట్లు అన్నీ ఒకే కథలో పెట్టి ఒక సరికొత్త అనుభూతిని ఇవ్వడానికి చేసిన ప్రయత్నం. స్క్రీన్‌పై జరిగేది చూసి తట్టుకోవడానికి గట్స్ ఉండాలి. అందుకే వీక్ హార్టెడ్ పీపుల్, పిల్లలు ఈ మూవీకి దూరంగా ఉండటమే మంచిది” అంటూ సంచలన స్టేట్మెంట్ ఇచ్చారు.
Also Read
- Dasharatha Madhav: ఐఐటీ ర్యాంక్.. గోల్డ్ మెడల్.. టాటా ఏరో స్పేస్‌లో జాబ్.. చివరకు నటుడిగా!
- Rudravanam PS: మరో ఇంట్రెస్టింగ్ క్రైమ్ థ్రిల్లర్.. అక్టోబర్ 30 నుంచి ‘రుద్రవనం పీఎస్’ స్ట్రీమింగ్.!
- Pocket Rockets: నిహారిక కొణిదెల నిర్మాణంలో ‘పాకెట్ రాకెట్స్’.. గ్యాంబ్లింగ్ నేపథ్యంలో యూత్‌ఫుల్ డ్రామా.!
- Sai Pallavi: "రావణుడు పూర్తిగా చెడ్డవాడు కాదు".. లాస్ ఎంజెల్స్ వేదికగా సాయి పల్లవి సంచలన వ్యాఖ్యలు..
సినిమా ప్రారంభం నుంచి ఒక ఎత్తయితే, సెకండ్ హాఫ్‌లోని చివరి అరగంట నుంచి 45 నిమిషాల భాగం ఆడియన్స్‌కు ఒక ఓవర్వెల్మింగ్ ఎక్స్పీరియన్స్ ఇస్తుందని విశ్వక్ స్పష్టం చేశారు. ఆ ఎపిసోడ్లో అడ్రినలిన్ రష్ ఏ రేంజ్లో ఉంటుందో ఊహించడం కూడా కష్టమని చెప్పారు. తన కెరీర్లోనే అత్యంత కష్టమైన, రిస్క్‌తో కూడిన సినిమా ఇదని.. తన సోదరుడు, తారక్ సినిమాస్ వెన్నుదన్నుగా నిలవడం వల్లే ఇది పేపర్ మీద కథగా మిగిలిపోకుండా వెండితెరపై ఒక విజువల్ మ్యాడ్నెస్గా రూపుదిద్దుకుందని పేర్కొన్నారు.
ఈ వైల్డ్ రైడ్‌ను థియేటర్లలో పూర్తిస్థాయిలో అనుభవించాలంటే సౌండ్ చాలా ముఖ్యమని విశ్వక్ నొక్కి చెప్పారు. “థియేటర్ యాజమాన్యాలు, డిస్ట్రిబ్యూటర్లకు నాదొకటే రిక్వెస్ట్.. సౌండ్ వాల్యూమ్ 6.7 మెయింటైన్ చేయండి. ఒకవేళ థియేటర్లో శబ్దం తక్కువగా అనిపిస్తే ఆడియన్సే స్వయంగా వెళ్లి సౌండ్ పెంచమని అడగండి” అని పిలుపునిచ్చారు. ఈ చిత్రంలో తన కష్టం 49 శాతం అయితే, రవి బస్రూర్ అందించిన మ్యూజిక్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ 51 శాతం ప్రాణం పోసిందని విశ్వక్ వెల్లడించారు. రవితేజ గిరిజాల కట్ చేసిన ఎడిటింగ్, ఫాక్సీ కెమెరా వర్క్, అలాగే విలక్షణ పాత్రలో కనిపించనున్న తారక్ పొన్నప్ప స్క్రీన్ ప్రెజెన్స్ ఆడియన్స్‌కు ఫ్లాష్ కట్స్లా వెంటాడుతాయని విశ్వక్ పేర్కొన్నారు. దాదాపు 150 మంది నటీనటులతో 45 రోజుల పాటు నాన్‌స్టాప్‌గా శ్రమించి రూపొందించిన ఈ వైల్డ్ ప్రయోగం బాక్సాఫీస్ వద్ద ఏ స్థాయి ప్రకంపనలు సృష్టిస్తుందో చూడాలి.
తాజావార్తలు
-
Vishwak Sen: ‘కల్ట్’ వైల్డ్ రైడ్.. గుండె ధైర్యం ఉంటేనే థియేటర్‌కు రండి..
-
Dinesh Karthik: విరాట్, రోహిత్ కాదు… ఈ భారత యువ సంచలనమే వరల్డ్ బెస్ట్ ఓపెనర్..
-
Ragi Biscuits: ఓవెన్ లేకుండానే ఇంట్లో కరకరలాడే ‘రాగి బిస్కెట్లు’.. ఇలా చేస్తే పిల్లలు లొట్టలేసుకుంటూ తింటారంతే..!
-
Chhattisgarh Red Sky: ఛత్తీస్‌గఢ్‌లో రక్తం రంగులోకి మారిన ఆకాశం.. దీనికి అసలు కారణం ఏంటి?
-
‘Raids for Reels’: కేఎన్ నెహ్రూ నివాసంలో సోదాలు.. ‘రీల్స్ కోసమే దాడులు’ అంటూ స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు!
ట్రెండింగ్
-
Rice Flour Poori Recipe: ప్రతీసారి గోధుమ పిండి పూరీలేనా?.. ఈ ఫెస్టివల్ సీజన్లో సాఫ్ట్ బియ్యప్పిండి పూరీలు ట్రై చేయండి..
-
Remove Stubborn Stains: ఈ ఒక్క చిట్కా పాటిస్తే చాలు.. బట్టలపై ఉండే ఎంతటి జిడ్డు, మొండి మరకలైనా ఇట్టే వదలాల్సిందే..!
-
Tata Motors Diwali Offers: ఆఫర్లే.. ఆఫర్లు.. టాటా మోటార్స్ దీపావళి సేల్..! ఏ కారుపై ఎంత తగ్గించారంటే..?
-
Cauliflower Quality Test: క్యాలీఫ్లవర్లో పురుగులు ఉన్నాయో లేదో ఇలా తెలుసుకోండి.. కోయకుండానే కనిపెట్టొచ్చు..
-
WPL 2027 మినీ వేలం పూర్తి.. 25 మంది ఆటగాళ్ల కొనుగోలు.. 5 జట్ల పూర్తి స్క్వాడ్ వివరాలు ఇవే..!