Chhattisgarh Red Sky: ఛత్తీస్‌గఢ్‌లో రక్తం రంగులోకి మారిన ఆకాశం.. దీనికి అసలు కారణం ఏంటి?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Chhattisgarh Red Sky: ఛత్తీస్‌గఢ్‌లో ఆకాశం ఒక్కసారిగా ఎర్రగా, రక్తం రంగులోకి మారిపోవడం స్థానికులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. అర్నబ్ తుఫాను కారణంగా ఈ ప్రాంతంలో వీస్తున్న ఈదురు గాలులు, అస్థిరమైన వాతావరణం నడుమ ఈ వింత దృశ్యం ఆవిష్కృతమైంది. ఆకాశం ఎరుపు రంగులోకి మారిన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ కావడంతో, దీని వెనుక ఉన్న కారణాలపై తీవ్ర స్థాయిలో చర్చ నడుస్తోంది. మధ్య భారతంలో అర్నబ్ తుఫాను శేషాలు (రెమ్నెంట్స్) ముందుకు కదలడంతో భారీ వర్షాలు, బలమైన గాలులు, ఉరుములతో కూడిన తుఫాను హెచ్చరికలు జారీ అయ్యాయి. సరిగ్గా ఇదే సమయంలో ఈ ఎర్రటి ఆకాశం కనిపిచేసరికి అందరి దృష్టి దీనిపై పడింది. అయితే, ఈ ఎరుపు రంగు ఆకాశానికి తుఫాను వంటి వాతావరణ పరిస్థితులు కొంతవరకు దోహదపడి ఉండవచ్చు. కానీ అర్నబ్ తుఫానుకు, ఈ రంగు మార్పునకు ప్రత్యక్ష సంబంధం ఉందనడానికి ఇప్పటివరకు స్పష్టమైన ఆధారాలు లేవని నిపుణులు చెబుతున్నారు.
సాధారణంగా ఆకాశం ఎరుపు రంగులోకి మారడానికి సూర్యకాంతి వాతావరణంలోని అణువులు, కణాల ద్వారా చెల్లాచెదురు (స్కాటరింగ్) అవ్వడమే ముఖ్య కారణమట. ముఖ్యంగా సూర్యోదయం, సూర్యాస్తమయ సమయాల్లో సూర్యకాంతి వాతావరణంలో ఎక్కువ దూరం ప్రయాణించాల్సి వస్తుంది. ఆ సమయంలో తక్కువ తరంగదైర్ఘ్యం కలిగిన నీలం రంగు కాంతి ఎక్కువగా చెల్లాచెదురై పోతుంది. ఇక, ఎక్కువ తరంగదైర్ఘ్యం (Wavelength) ఉన్న ఎరుపు, నారింజ రంగులు మాత్రమే మన కంటికి స్పష్టంగా కనిపిస్తాయి. దీనిని శాస్త్రీయంగా రేలీ స్కాటరింగ్ (Rayleigh scattering) అంటారు. దీనికి తోడు వాతావరణంలో దుమ్ము, పొగ, నీటి బిందువులు వంటి పెద్ద కణాలు ఉన్నప్పుడు ఎరుపు రంగు తీవ్రత ఇంకా పెరుగుతుంది. తుఫాను మేఘాలు, దుమ్ము, వెలుతురు-నీడల కలయిక వల్ల కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ఆకాశం ఇలా అత్యంత భయానకంగా, ఎర్రగా కనిపిస్తుంది. కానీ.. ఈ అంశంపై శాస్త్రవేత్తలు ఇంకా పరిశోధనలు జరుపుతూనే ఉన్నారు. ఈ తరుణంలో స్థానికులు అధికారులు జారీ చేసే హెచ్చరికలను పాటిస్తూ జాగ్రత్తగా ఉండాలి.
Also Read
- Death Threat: బిగ్ బీ కుటుంబానికి మరో బిగ్ వార్నింగ్.. అమితాబ్, అభిషేక్‌లను టార్గెట్ చేశామంటూ గ్యాంగ్‌స్టర్ సంచలనం.!
- Rahul Gandhi Reveals Dating Story: తన తల్లిదండ్రులు ప్రేమలో పడిన రెస్టారెంట్‌కే గర్ల్‌ఫ్రెండ్‌ను తీసుకెళ్లిన రాహుల్ గాంధీ.. ఆసక్తికర విషయాలు!
- Crispy Murmura Mixture: బయట కొనే చిరుతిళ్లకు చెక్.. ఇంట్లోనే కమ్మని కరకరలాడే 'మరమరాల మిక్చర్' సులువుగా చేసుకోండి ఇలా..!
- Vijaya Dairy Board Emergency Meeting: విజయ డైరీలో కీలక పరిణామం.. రేపటికి వాయిదా పడిన బోర్డు అత్యవసర సమావేశం!
తాజావార్తలు
-
Rashmika-Mysaa: కల్యాణి ప్రియదర్శన్ రికార్డుపై రష్మిక కన్ను.. ‘మైసా’తో చరిత్ర సృష్టిస్తుందా?
-
Death Threat: బిగ్ బీ కుటుంబానికి మరో బిగ్ వార్నింగ్.. అమితాబ్, అభిషేక్‌లను టార్గెట్ చేశామంటూ గ్యాంగ్‌స్టర్ సంచలనం.!
-
ASEAN Summit 2026: ప్రపంచానికి ఇప్పుడు శాంతి, స్థిరత్వమే అత్యవసరం.. ఆసియాన్ సదస్సులో ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు
-
Rahul Gandhi Reveals Dating Story: తన తల్లిదండ్రులు ప్రేమలో పడిన రెస్టారెంట్‌కే గర్ల్‌ఫ్రెండ్‌ను తీసుకెళ్లిన రాహుల్ గాంధీ.. ఆసక్తికర విషయాలు!
-
Crispy Murmura Mixture: బయట కొనే చిరుతిళ్లకు చెక్.. ఇంట్లోనే కమ్మని కరకరలాడే ‘మరమరాల మిక్చర్’ సులువుగా చేసుకోండి ఇలా..!
ట్రెండింగ్
-
Amla Pulihora Recipe: పుల్లపుల్లగా, కమ్మకమ్మగా నోరూరించే ‘ఉసిరికాయ పులిహోర’.. కేవలం నిమిషాల్లోనే రెడీ చేసుకోండి ఇలా..!
-
ఏడు అంగుళాల భారీ డిస్ప్లే, 13,300mAh బ్యాటరీతో HONOR కొత్త స్మార్ట్‌ఫోన్..!
-
IPL 2027 రిటెన్షన్లకు నేడే చివరి గడువు.. ఇప్పటి వరకు జరిగిన ట్రేడ్స్ లిస్ట్ ఇదిగో..
-
12.1 అంగుళాల 2.8K డిస్ప్లే, 10,050mAh బ్యాటరీతో OPPO Pad Air6 ట్యాబ్లెట్ లాంచ్..!
-
10 రోజుల బ్యాటరీ లైఫ్, IP69+IP69K రేటింగ్స్, 100+ స్పోర్ట్స్ మోడ్లతో OPPO Watch 5 లాంచ్..!