Dinesh Karthik: విరాట్, రోహిత్ కాదు… ఈ భారత యువ సంచలనమే వరల్డ్ బెస్ట్ ఓపెనర్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అభిషేక్ శర్మ ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యుత్తమ టీ20 ఓపెనర్ అని భారత మాజీ క్రికెటర్ దినేష్ కార్తీక్ కొనియాడారు. అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టినప్పటి నుంచి అభిషేక్ ఎంతో ప్రమాదకరమైన బ్యాటింగ్‌తో ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడుతున్నారు. టీ20 అంతర్జాతీయ క్రికెట్లో ఇంత వేగంగా, అత్యధిక స్ట్రైక్ రేట్‌తో పరుగులు చేసిన మరొక బ్యాటర్ లేరంటే ఆయన బ్యాటింగ్ తీరు ఎంత ధాటిగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ప్రతిసారీ భయం లేకుండా తన షాట్లు ఆడటమే ఆయన అసలైన బలంగా మారింది.
సాధారణంగా కొందరు బ్యాటర్లు ప్రతి ఐదు లేదా ఆరు ఇన్నింగ్స్‌లకు ఒక మంచి ఇన్నింగ్స్ ఆడుతుంటారు. కానీ అభిషేక్ మాత్రం ప్రతి రెండు లేదా మూడు ఇన్నింగ్స్లకోసారి జట్టుకు మ్యాచ్‌ను గెలిపించే ఇన్నింగ్స్ ఆడుతున్నారని క్రిక్‌బజ్ వేదికగా దినేష్ కార్తీక్ విశ్లేషించారు. న్యూజిలాండ్‌తో జరిగిన మూడో టీ20 మ్యాచ్‌లో కేవలం 15 బంతుల్లో అర్ధశతకం, 35 బంతుల్లో శతకం బాది ప్రపంచంలోని ఏ పిచ్‌పైనైనా తానూ విధ్వంసకర బ్యాటింగ్ చేయగలనని రుజువు చేశారన్నారు.
Also Read
- Ragi Biscuits: ఓవెన్ లేకుండానే ఇంట్లో కరకరలాడే 'రాగి బిస్కెట్లు'.. ఇలా చేస్తే పిల్లలు లొట్టలేసుకుంటూ తింటారంతే..!
- Chhattisgarh Red Sky: ఛత్తీస్‌గఢ్‌లో రక్తం రంగులోకి మారిన ఆకాశం.. దీనికి అసలు కారణం ఏంటి?
- Rice Flour Poori Recipe: ప్రతీసారి గోధుమ పిండి పూరీలేనా?.. ఈ ఫెస్టివల్ సీజన్లో సాఫ్ట్ బియ్యప్పిండి పూరీలు ట్రై చేయండి..
- Jamia Students Protest: "2006 నుంచి ఎన్నికలు లేవు".. తీవ్రరూపం దాల్చిన జామియా యూనివర్సిటీ విద్యార్థుల ఉద్యమం..
సాధారణంగా అభిషేక్ శర్మ ఆఫ్ స్పిన్ బౌలింగ్‌లో బలహీనంగా ఉంటారని చాలామంది అనుకుంటారు. కానీ ఆ బలహీనతను కూడా దాటుకుని ఆయన ఆఫ్ స్పిన్నర్లపై విరుచుకుపడుతున్నారు. ఉదాహరణకు, మైకేల్ బ్రాస్‌వెల్ వేసిన మొదటి ఓవర్లోనే కేవలం నాలుగు బంతుల్లో 15 పరుగులు సాధించి తన ఆధిపత్యాన్ని చాటుకున్నారు. ఆరంభంలోనే ఒకవేళ వికెట్ పడినా సరే, జట్టుకు దూకుడుగా ఆరంభాన్ని అందించాలనే తన వైఖరిని ఆయన ఎప్పుడూ మార్చుకోవడం లేదని తెలిపారు.
సన్ రైజర్స్ హైదరాబాద్ (SRH) తరుఫునైనా లేదా భారత జట్టు తరుఫునైనా సరే ఆయన ఒకే విధమైన ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తున్నారు. ఆస్ట్రేలియాలోని కఠినమైన పిచ్‌లపై, పెద్ద బౌండరీలు ఉన్న మెల్బోర్న్ లాంటి గ్రౌండ్లలో కూడా భారత్‌కు అద్భుతమైన ఆరంభాన్ని అందించారు. వేర్వేరు దేశాలు, భిన్నమైన పరిస్థితులలో కూడా అత్యధిక స్ట్రైక్ రేట్, గొప్ప మైండ్ సెట్‌తో బ్యాటింగ్ చేస్తున్నారు. అందుకే ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యుత్తమ ఓపెనర్ అభిషేక్ శర్మ అని దినేష్ కార్తీక్ నమ్ముతున్నారు.
తాజావార్తలు
-
Dinesh Karthik: విరాట్, రోహిత్ కాదు… ఈ భారత యువ సంచలనమే వరల్డ్ బెస్ట్ ఓపెనర్..
-
Ragi Biscuits: ఓవెన్ లేకుండానే ఇంట్లో కరకరలాడే ‘రాగి బిస్కెట్లు’.. ఇలా చేస్తే పిల్లలు లొట్టలేసుకుంటూ తింటారంతే..!
-
Chhattisgarh Red Sky: ఛత్తీస్‌గఢ్‌లో రక్తం రంగులోకి మారిన ఆకాశం.. దీనికి అసలు కారణం ఏంటి?
-
‘Raids for Reels’: కేఎన్ నెహ్రూ నివాసంలో సోదాలు.. ‘రీల్స్ కోసమే దాడులు’ అంటూ స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు!
-
Dasharatha Madhav: ఐఐటీ ర్యాంక్.. గోల్డ్ మెడల్.. టాటా ఏరో స్పేస్‌లో జాబ్.. చివరకు నటుడిగా!
ట్రెండింగ్
-
Rice Flour Poori Recipe: ప్రతీసారి గోధుమ పిండి పూరీలేనా?.. ఈ ఫెస్టివల్ సీజన్లో సాఫ్ట్ బియ్యప్పిండి పూరీలు ట్రై చేయండి..
-
Remove Stubborn Stains: ఈ ఒక్క చిట్కా పాటిస్తే చాలు.. బట్టలపై ఉండే ఎంతటి జిడ్డు, మొండి మరకలైనా ఇట్టే వదలాల్సిందే..!
-
Tata Motors Diwali Offers: ఆఫర్లే.. ఆఫర్లు.. టాటా మోటార్స్ దీపావళి సేల్..! ఏ కారుపై ఎంత తగ్గించారంటే..?
-
Cauliflower Quality Test: క్యాలీఫ్లవర్లో పురుగులు ఉన్నాయో లేదో ఇలా తెలుసుకోండి.. కోయకుండానే కనిపెట్టొచ్చు..
-
WPL 2027 మినీ వేలం పూర్తి.. 25 మంది ఆటగాళ్ల కొనుగోలు.. 5 జట్ల పూర్తి స్క్వాడ్ వివరాలు ఇవే..!