సలార్, గోట్ లైఫ్ బస్టర్ హిట్స్‌తో పృధ్వీరాజ్ సుకుమారన్ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారాడు. కెరీర్ గ్రోత్ ఒక్కసారిగా పీక్స్‌కు చేరింది. ఎంతలా అంటే త్రీ ఇండస్ట్రీస్‌లో భారీ ఆఫర్లను కొల్లగొట్టేంతలా. ఓ వైపు హీరోగా, మరో వైపు దర్శకుడిగా సినిమాలు తీస్తూ మరో వైపు నెగిటివ్ రోల్స్ చేస్తూ కెరీర్‌లో రిస్క్ చేస్తున్నాడు. రీసెంట్లీ దర్శకుడిగా లూసిఫర్ 2తో ఫిల్మ్ మేకర్‌గా హ్యాట్రిక్ హిట్ చూశాడు ఈ మలయాళ స్టార్ హీరో.
Also Read : Good Bad Ugly : మైత్రీ మూవీ మేకర్స్ కు ఇళయరాజా నోటీసులు
ప్రజెంట్ లైనప్ పెంచుకునే పనిలో బిజీగా ఉన్నాడు ఈ మల్టీ టాలెంటర్ . ఓన్ ఇండస్ట్రీలో విలయాత్ బుద్ద, నోబడీ, సంతోష్ ట్రోఫీ చేస్తున్న వర్సటైల్ యాక్టర్ బాలీవుడ్‌లోనూ క్రేజీ ప్రాజెక్టులను తన బ్యాగ్‌లో వేసుకుంటున్నాడు. అయ్యాతో నార్త్ బెల్ట్ లో తెరంగేట్రం చేసినా రావాల్సినంత క్రేజ్ రాలేదు. రీసెంట్లీ బడే మియా చోటా మియాలో నెగిటివ్ రోల్ పోషించినా సరైన గుర్తింపు దక్కలేదు. ఇప్పుడు పడిన చోటే నిలదొక్కుకునేందుకు ట్రై చేస్తున్నాడు. హిందీలో సర్జమీన్‌తో పాటు మేఘన గుల్జర్ చిత్రంలో “డాయిర’కు కమిటయ్యాడు. కరీనా కపూర్ ఫీమేల్ లీడ్‌గా కనిపించబోతుంది. ఎప్పుడూ హీరోగా ఏం చేస్తాం ప్రేక్షకులకు కూడా బోర్ కొట్టేస్తుందేమో అనుకున్న పృధ్వీరాజ్ సుకుమారన్ నెగిటివ్ షేడ్స్ చూపిస్తూ తనలోని యాక్టింగ్ స్కిల్ ప్రేక్షకులకు చూపిస్తున్నాడు. టాలీవుడ్‌లో ఎస్ఎస్ఎంబీలో నెగిటివ్ రోల్ చేయబోతున్నాడన్నది ఓపెన్ సీక్రెట్. కేవలం హీరోల విషయంలో రాజమౌళి రిస్ట్రిక్షన్స్ ఉన్న నేపథ్యంలో ప్రీ బర్డ్ అయిపోయాడు పృధ్వీ. అందుకే ఆల్ ఇండస్ట్రీలను చుట్టేస్తూ బ్యాక్ టు బ్యాక్ చిత్రాలకు కమిట్ అవుతూ తీరిక లేకుండా షూటింగ్స్‌లో పాల్గొంటున్నాడు.