స్టార్ హీరో విశాల్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగు వాడైన ఆయన కోలీవుడ్ లోనే స్టార్ డమ్ సంపాదించుకున్నాడు. ‘చెల్లమే’ చిత్రం ద్వారా హీరోగా ఎంట్రీ ఇచ్చిన విశాల్‌కు ‘సందైకోడి’ మూవీ మాస్ ఇమేజ్‌ను తెచ్చిపెట్టింది. ఆ తర్వాత చేసిన సినిమాలు కూడా మంచి విజయాలు సాధించడంతో కోలీవుడ్‌లో స్టార్ హీరోగా ఎదిగారు విశాల్. ఆయన సినిమాలు డబ్బింగ్ ద్వారా తెలుగు వారిని కూడా ఆకట్టుకోవడంతో విషల్‌కు ఇక్కడ కూడా మంచి మార్కేట్ ఏర్పడింది. ఇక సినిమాల ముచ్చట పక్కన పెడితే.. దక్షిణాది చిత్ర పరిశ్రమలోని మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్స్‌లో హీరో విశాల్ ఒకరు. అభిమానులు, సినీ ప్రముఖులు విశాల్ పెళ్లి కోసం ఎదురుచూస్తున్నారు. అయితే విశాల్ పెళ్లి, ప్రేమలపై గతంలో ఎన్నో వార్తలు వినిపించాయి. కానీ అవన్నీ గాలి వార్తలుగా మిగిలిపోగా తాజాగా తన పెళ్లిపై హీరో విశాల్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ వివరాల్లోకి వెళితే..
Also Read : Taapsee Pannu : ‘ముల్క్’ మూవీ సీక్వెల్‌ను మొదలెట్టిన తాప్సీ..!
‘నడిగర్ సంఘం’ బిల్డింగ్ నిర్మాణం పూర్తైన వెంటనే తాను పెళ్లి చేసుకుంటానని గతంలో విశాల్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈక్రమంలో ఇటీవల బిల్డింగ్ నిర్మాణం పూర్తైంది. ఈ విషయంపై ఆయన మీడియాతో మాట్లాడారు. అలాగే పెళ్లి గురించి కూడా ప్రస్తావించారు.. ‘త్వరలోనే పెళ్లి చేసుకుంటా. నా జీవిత భాగస్వామిని కూడా సెలెక్ట్ చేసుకున్నాను. ఇప్పటికే పెళ్లి గురించి మా మధ్య చర్చలు జరుగుతున్నాయి. మాది ప్రేమ వివాహమే. త్వరలోనే మరిన్ని వివరాలు తెలియజేస్తా’ అని అన్నారు. అయితే హీరోయిన్ సాయి ధన్సికతో ఆయన ప్రేమలో ఉన్నారని కోలీవుడ్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి మరి ఆమె ను ఉదేశించే ఈ కామెంట్స్ చేశారా? ఇంతకి విశాల్ ఎవ్వరితో లవ్‌లో ఉన్నాడు?..