ప్రస్తుతం టాలీవుడ్ రేంజ్ ఎలా ఉందో మనకు తెలిసిందే. ప్రపంచ వ్యాప్తంగా మన చిత్రాలు మారుమ్రోగి పోతున్నాయి. దీంతో తెలుగులో ఒక ఛాన్స్ వస్తే చాలు అని మిగతా ఇండస్ట్రీ వారు కోరుకుంటున్నారు. కానీ ఒకప్పుడు కోలివుడ్ ఇండస్ట్రీ స్థాయి కూడా వేరుగా ఉండేది. అక్కడి సినిమాలు కచ్చితంగా తెలుగులోనూ రిలీజ్ అయ్యేవి. వాటి రీచ్ చూసి మన దగ్గర ఇలాంటి చిత్రాలు రావేంటి అని ఫీలయ్యేవాళ్లు మన తెలుగు ప్రేక్షకులు. తమిళ సినిమాలతో పోలిస్తే తెలుగు చిత్రాలు చాలా వెనుకబడి ఉన్నట్లు అనిపించేది. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. ప్రజంట్ మన సినిమాలకు వస్తున్న రీచ్ చూసి మిగతా ఇండస్ట్రీల వాళ్లు ఫీలయ్యే పరిస్థితికి వచ్చింది. రీసెంట్ గా తమిళ హీరో విక్రమ్ కూడా అదే అన్నారు.
Also Read :SYG : శ్రీకాంత్ పవర్‌ఫుల్ లుక్ రిలీజ్..
కోలీవుడ్ స్టార్ హీరో విక్రమ్ ‘వీర ధీర శూర’ మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ మూవీ ప్రమెషన్స్‌లో భాగంగా తాజాగా ప్రేస్ మీట్ నిర్వాహించారు మూవీ టీం.. ఇందులో భాగంగా విక్రమ్ మాట్లాడుతూ.. ‘ టాలీవుడ్‌ని చూస్తే నాకు అసూయగా ఉంది. ఎందుకంటే తెలుగులో ప్రస్తుతం గొప్ప కథలు వస్తున్నాయి.. పూర్తి కమర్షియల్, అదే సమయంలో కంటెంట్ ఓరియెంటెడ్ మూవీస్ కూడా వస్తున్నాయి . ఈ రెండు రకాల చిత్రాలను పెద్ద హిట్ అవుతాయి. ఇంత వైరుధ్యం చాలా అరుదు. తెలుగు ప్రేక్షకులు ఈ వారీ సినిమాను ఎంతగానో ప్రేమిస్తారు, ఎంతో సెలబ్రేట్ చేస్తారు. తమిళంలో కూడా ఇలాంటి పరిస్థితి రావాలని కోరుకుంటున్నా. మా సినిమా కొత్తగా ఉంటుంది. అందరూ ఎంజాయ్ చేసేలా ఉంటుంది’ అని వ్యాఖ్యానించాడు. ఇక తెలుగులో ఇప్పటిదాకా స్ట్రెయిట్ మూవీ చేయకపోవడం గురించి స్పందిస్తూ.. ‘నా దగ్గరికి సరైన స్క్రిప్ట్ రాలేదు, అలాగే భాష సమస్యగా ఉండేది’ అని అన్నాడు.