‘అల్లుడు శ్రీను’ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చారు బెల్లంకొండ సాయి శ్రీనివాస్. మొదటి చిత్రంతోనే తన యాక్టింగ్ తో వంద మార్కులు సంపాదించుకున్నాడు. తర్వాత పలు చిత్రాల్లో నటించాడు కానీ పెద్దగా ఆకట్టుకోలేక పొయ్యాయి. ఇక ఇప్పుడు తాజాగా ‘భైరవం’ సినిమాలో నటించాడు. ఈ సినిమాలో మంచు మనోజ్, నారా రోహిత్ కూడా ప్రధాన పాత్రలో నటించగా, దర్శకుడు విజయ్ కనకమేడల తెరకెక్కించిన ఈ సినిమా మే 30 న ప్రేక్షకుల ముందుకు రానుంది.
Also Read : Prabhas : దీపిక ఓవర్‌గా కండిషన్స్.. హర్ట్ అయిన సందీప్ రెడ్డి వంగ !
‘గరుడన్’ అనే తమిళ సినిమా రీమేక్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమా నుండి, ఇప్పటికే, విడుదలైన అప్‌డేట్ లని ఆకట్టుకోగా.. తాజాగా ఈ సినిమా నుంచి రిలీజైన ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఇక సినిమా విడుదల దగ్గర పడుతుండటంతో హీరోలు ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.. ‘కరోనాకు ముందు తర్వాత ప్రేక్షకుల్లో చాలా మార్పు వచ్చింది. నేను స్టార్ హీరో కొడుకును కాదు. ప్రొడ్యూసర్ కొడుకు. అయినంత మాత్రాన నెపోకిడ్స్ అయిపోదు. ఇండస్ట్రీలోకి స్వతహాగా వచ్చాను. స్టార్ హీరోలకు భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది, వాళ్ళ కొడుకులు చాలా కష్ట పడతారు అయిన కూడా వారు నెపోకిడ్స్ అని అంటారు. మా నాన్న ప్రొడ్యూసర్ అయినా క్రెడిబులిటీ సంపాదించుకోవాలి అంటే కష్టపడాల్సిందే. ప్రతి విషయంలో జాగ్రత్తలు తీసుకోవాల్సిందే’ అని తెలిపారు . ప్రజంట్ సాయి శ్రీనివాస్ మాటలు వైరల్ అవుతున్నాయి.