టాలీవుడ్ యూత్ ఐకాన్ విజయ్ దేవరకొండ.. ప్రస్తుతం ‘కింగ్డమ్’ సినిమా షూటింగ్‌తో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ యాక్షన్ డ్రామా జులై 31న గ్రాండ్ రిలీజ్‌కి రెడీ అవుతుంది. ఈ సినిమా మీద ఇప్పటికే మంచి అంచనాలు నెలకొన్నాయి. అయితే ఇప్పుడు విజయ్ తదుపరి సినిమా గురించి ఆసక్తికర అప్డేట్ బయటకు వచ్చింది. రాహుల్ సాంకృత్యాయన్ దర్శకత్వంలో విజయ్ తన తదుపరి చిత్రాన్ని చేయబోతున్నాడు. ఈ సినిమాకు సంబంధించి ముహూర్తాన్ని అధికారికంగా ఖరారు చేశారు.
Also Read : Hari Hara Veera Mallu : వీరమల్లు నుంచి ‘ఎవరది ఎవరది.. కొత్త పాట
విజయ్ దేవరకొండ 14వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన పూజా కార్యక్రమాలు జూలై 10న ఉదయం 11:09 గంటలకు నిర్వహించనున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. ఈ వేడుకకు సినీ పరిశ్రమ నుంచి ఎవరు గెస్టులుగా హాజరుకాబోతున్నారన్నదాన్ని మాత్రం సస్పెన్స్‌గానే ఉంచారు. ఇక ‘టాక్సీవాలా’, ‘శ్యామ్ సింగ రాయ్’ వంటి విభిన్న చిత్రాలతో దర్శకుడిగా తనకంటూ ప్రత్యేక స్థానం ఏర్పరచుకున్న రాహుల్ సాంకృత్యాయన్, ఈసారి చారిత్రాత్మక నేపథ్యం లో కథను తెరకెక్కించబోతున్నారు. ఈ కథలో మన భారత చరిత్రలో జరిగిన ఓ కీలక సంఘటన ఆధారంగా ముడిపడి ఉండే గొప్ప కథను చూపించనున్నట్లు సమాచారం.
కాగా ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్, టి-సిరీస్ సంస్థలు సంయుక్తంగా నిర్మించనున్నాయి. రెండు పెద్ద బ్యానర్లు కలవడం, చారిత్రాత్మక అంశం ఉండడం వల్ల ఈ సినిమాపై మొదటి నుంచే భారీ అంచనాలు ఏర్పడుతున్నాయి. ఈ సినిమాను పాన్ ఇండియా లెవల్లో రూపొందించేందుకు టీమ్ ఇప్పటికే ప్రీ-ప్రొడక్షన్ పనులు జోరుగా చేస్తుంది. ఇప్పటివరకు రొమాంటిక్, యాక్షన్, మసాలా జానర్స్‌లో కనిపించిన విజయ్ దేవరకొండ ఈసారి పూర్తిగా విభిన్నమైన పాత్రలో కనిపించబోతున్నారు. చరిత్రకు సంబంధించిన పాత్ర ఎలా పోషిస్తాడు? ప్రేక్షకుల నుంచి ఎలాంటి స్పందన వస్తుంది? అన్న దానిపై ఆసక్తి నెలకొంది.