పవన్‌కళ్యాణ్ హీరోగా నటిస్తున్న పీరియాడిక్ యాక్షన్ డ్రామా చిత్రం ‘హరిహర వీరమల్లు’. ఇప్పటికే టీజర్, ట్రైలర్‌తో పాటు పాటలతో ప్రేక్షకుల్లో భారీ అంచనాలు పెంచిన ఈ చిత్రం నుంచి తాజాగా ‘ఎవరది ఎవరది’ అనే మాస్ అండ్ మిస్టీరియస్ సాంగ్‌ను విడుదల చేశారు. కాగా ఈ సాంగ్ పూర్తిగా పవన్ కళ్యాణ్ శైలిలో సాగుతుంది. ఓ రహస్య మయమైన, పోరాటమే జీవితం అయిన నాయకుడి కథను చెబుతూ సాగే ఈ పాటకు ఎంఎం కీరవాణి స్వరపరిచిన మ్యూజిక్, పట్టు పట్టే లిరిక్స్, పవర్‌ఫుల్ బ్యాక్‌డ్రాప్ అందరికీ గూస్‌బంప్స్ కలిగిస్తోంది.
Also Read : Bad Girl : ఎట్టకేలకు ‘బ్యాడ్ గర్ల్’ కి సెన్సార్ గ్రీన్ సిగ్నల్!
ముఖ్యంగా “ఎవరది ఎవరది..అతగాడో పొడుపు కథ..దొరకనే దొరకడు అతగాడో మెరుపు కథ..” అంటూ సాగుతూ పవన్ ఫ్యాన్స్‌లో ఉత్సాహాన్ని రెట్టింపు చేసింది. ప్రస్తుతం ఈ పాట యూట్యూబ్, సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో వైరల్‌గా మారింది. ఈ సినిమా మొదట క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో ప్రారంభమైంది. అయితే, వివిధ కారణాలతో మిగిలిన భాగాన్ని నిర్మాత ఎ.ఎం.రత్నం కుమారుడు జ్యోతి కృష్ణ దర్శకత్వం వహించారు. ఈ చిత్రానికి నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటించగా, ప్రముఖ బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ విలన్‌గా కనిపించనున్నాడు.