Rowdy Janardhana: ‘రౌడీ జనార్దన’కి డబుల్ మ్యూజిక్ ట్రీట్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
విజయ్ దేవరకొండ సినిమాల్లో కథలతో పాటు ఆడియో ఆల్బమ్స్‌కు, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌కు ఉండే క్రేజ్ ప్రత్యేకమైనది. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని, ‘రౌడీ జనార్దన’ చిత్రాన్ని మ్యూజికల్‌గా నెక్స్ట్ లెవెల్‌కు తీసుకెళ్లడం కోసం ఇద్దరు టాప్ కంపోజర్లను ఎంపిక చేశారు. ఈ చిత్రానికి మొదట ‘ప్రేమలు’ (Premalu) ఫేమ్ క్రిస్టో జేవియర్ మ్యూజిక్ డైరెక్టర్‌గా ఎంపికవ్వగా.. ఇప్పుడు ఆయనతో పాటు ‘టాక్సిక్’ (Toxic), ‘యానిమల్’ ఫేమ్ బాలీవుడ్ సెన్సేషన్ విశాల్ మిశ్రా (Vishal Mishra) కూడా ఈ మెగా ప్రాజెక్ట్‌లోకి అడుగుపెట్టారు.ఈ ఇద్దరు మ్యూజిక్ డైరెక్టర్ల కలయికతో ‘రౌడీ జనార్దన’ ఆల్బమ్ బాధ్యతలను మేకర్స్ చాలా స్మార్ట్‌గా డివైడ్ చేశారు.
ఇక ఈ సినిమాలోని లవ్, ఎమోషనల్.. మాస్ సాంగ్స్‌కు విశాల్ మిశ్రా మ్యూజిక్ సమకూర్చనున్నారు. ఇండిపెండెంట్ మ్యూజిక్‌తో పాటు సౌత్‌లోనూ బ్లాక్‌బస్టర్ ట్రాక్స్ ఇస్తున్న విశాల్ మిశ్రా మార్క్ మెలోడీలు ఈ సినిమాకు పెద్ద అసెట్ కానున్నాయి. రూరల్ యాక్షన్ సీక్వెన్స్‌లకు ప్రాణం పోసేలా బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ (BGM) బాధ్యతలను క్రిస్టో జేవియర్ హ్యాండిల్ చేయబోతున్నారు. ‘ప్రేమలు’ చిత్రంతో మ్యాజిక్ చేసిన క్రిస్టో.. ఈ సినిమాలో తన మార్క్ ఇంటెన్స్ స్కోర్‌తో థియేటర్లను ఊపేయడానికి రెడీ అవుతున్నారు. ఈ ఇద్దరి కాంబినేషన్లో రాబోతున్న ఆల్బమ్ ప్రేక్షకులకు సరికొత్త ఆడియో-విజువల్ ఎక్స్‌పీరియన్స్‌ను ఇస్తుందని దిల్ రాజు కాన్ఫిడెంట్‌గా ఉన్నారు.
Also Read
- Mahendragiri Varahi : 150 ఏళ్ల మరణాల మిస్టరీతో సుమంత్ సినిమా ట్రైలర్..డీజే టిల్లు సర్ ప్రైజ్ !
- Sumanth : ఈ కథను పట్టుకుని నేను, డైరెక్టర్ మూడేళ్లు ట్రావెల్ అయ్యాం!
- Venky Atluri: ఆయన ఎక్కడుంటే అక్కడ డబ్బే.. ఇండస్ట్రీలో ఆ హీరో జడ్జిమెంట్‌కి తిరుగులేదు!".
- Hero Sanjosh : బ్లైండ్ ఫౌండేషన్ అమ్మాయిలతో రాఖీ వేడుకలు జరుపుకున్న హీరో సంజోష్
ఇక ఈ ఇంటెన్స్ రూరల్ యాక్షన్ డ్రామాలో విజయ్ దేవరకొండ సరసన నేషనల్ అవార్డ్ విన్నర్ కీర్తి సురేష్ (Keerthy Suresh) హీరోయిన్గా నటిస్తుండటంతో ఈ ప్రాజెక్ట్‌పై అంచనాలు స్కై హై లో ఉన్నాయి.ఈ ఏడాది డిసెంబర్ (December 2026) లో క్రిస్మస్ కానుకగా ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో థియేటర్లలో విడుదల చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. విజయ్ దేవరకొండ ఊరమాస్ లుక్, విశాల్-క్రిస్టోల మ్యూజికల్ పవర్ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సునామీ సృష్టిస్తుందో చూడాలి.
తాజావార్తలు
-
Indian Railway: రైళ్లలో టికెట్ లేని ప్రయాణికులకు షాక్.. భారీగా జరిమానాలు..
-
Story Board : నేపాల్ ఆకస్మిక వరదలకు కారణాలేంటి..? చైనా నిర్లక్ష్యం ఎంతవరకు ఉంది..?
-
OTR: ఎమ్మెల్యే, ఎంపీ.. మధ్యలో సూర్యలంక బీచ్!
-
OTR: ఆ నేతకు పీఏ పోట్లు.. ఆ ఎమ్మెల్యే చుట్టూ నడుస్తున్న అసలు డ్రామా!
-
OTR: సొంత పార్టీ నేతలకే టార్గెట్ అవుతున్న తెలంగాణ బీజేపీ సోషల్ మీడియా!
ట్రెండింగ్
-
Fridge Wall Gap : ఫ్రిజ్‌ను గోడకు ఆనిస్తున్నారా? ఈ తప్పు చేయొద్దు.!
-
Mithali Raj: వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రతిభావంతుడు.. అతడికి సరైన మెంటర్ కావాలి.!
-
Mithali Raj: వనరుల కొరత నుంచి సమాన మ్యాచ్ ఫీజుల వరకు.. మహిళా క్రికెట్లో విప్లవం.!
-
Mithali Raj: ‘నా తప్పేమీ లేకున్నా తొక్కేయాలని చూశారు’.. 2018 నాటి వివాదంపై సంచలన వ్యాఖ్యలు.!
-
Mithali Raj: ‘సరైన వ్యక్తి దొరికితే ఆలోచిస్తా..’ పెళ్లి, వ్యక్తిగత జీవితంపై మనసు విప్పిన టీమిండియా మాజీ కెప్టెన్.!