Romeo : విజయ్ ఆంటోని “రోమియో” స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
విజయ్ ఆంటోనీ హీరోగా తెరకెక్కిన లేటెస్ట్ తమిళ్ మూవీ “రోమియో”.ఈ సినిమాలో విజయ్ ఆంటోనీ సరసన మృణాళిని రవి హీరోయిన్ గా నటించించింది .అలాగే ఈ సినిమాలో వీటీవీ గణేశ్, యోగిబాబు, ఇళవరసు, తలైవాసల్ విజయ్ మరియు సుధ ముఖ్య పాత్రలు పోషించారు.రోమియో చిత్రాన్ని డైరెక్టర్ వినాయకన్ వైద్యనాథన్ తెరకెక్కించారు.అలాగే ఈ మూవీని విజయ్ ఆంటోనీ ఫిల్మ్ కార్పొరేషన్ నిర్మించగా.. భరత్ ధనశేఖర్ మరియు రవి రోయ్స్టర్ సంగీతం అందించారు. విజయ్ ఆంటోనీ తన కెరీర్ లో ఎక్కువగా యాక్షన్ చిత్రాలే చేసిన ఈసారి రూటు మార్చి రొమాంటిక్ కామెడీ డ్రామా జానర్ అయిన “రోమియో” చిత్రం చేశారు.
ఈ సినిమాలో ఆయన నటన ఎంతగానో ఆకట్టుకుంది. భార్య ప్రేమను పొందేందుకు తంటాలు పడే భర్తగా ఆయన విజయ్ నటన ప్రేక్షకులను మెప్పించింది. హీరోయిన్ మృణాళిని రవి యాక్టింగ్ అదరగొట్టింది.ఈ సినిమా కోసం మేకర్స్ ప్రమోషన్లను భారీగానే చేశారు.ఏప్రిల్ 11న రోమియో థియేటర్లలో రిలీజ్ అయింది .అలాగే ఈ మూవీ తెలుగు వెర్షన్ లవ్ గురు అనే టైటిల్ తో రిలీజ్ అయింది.అయితే థియేటర్స్ లో ఈ సినిమాకు మిక్స్డ్ టాక్ రావడంతో అనుకున్న రేంజ్లో ఈ మూవీ వసూళ్లను రాబట్టలేకపోయింది.ఈక్రమంలో ఈ చిత్రం నెలలోపే ఓటీటీలోకి వచ్చేస్తోంది.రోమియో సినిమా మే 10వ తేదీన ఆహా తమిళ్ ఓటీటీ ప్లాట్ఫామ్లో స్ట్రీమింగ్కు రానుంది. ఈ విషయాన్ని ఆహా ఓటీటీ అధికారికంగా వెల్లడించింది. అయితే, ఈ మూవీ తెలుగు వెర్షన్ లవ్ గురు గురించి మాత్రం ఇంకా ఎలాంటి అప్డేట్ రాలేదు.రోమియో తెలుగు వెర్షన్ ‘లవ్ గురు’ సినిమా కూడా మే 10వ తేదీన ఆహా తెలుగు ఓటీటీలోకి వస్తుందో లేదో చూడాలి.
Also Read
తాజావార్తలు
-
Sai Sudharsan: చిన్నప్పుడు రోడ్డుపై ఆ జట్టును చూసేవాడిని.. ఇప్పుడు అదే జట్టుపై రికార్డులు: సాయి సుదర్శన్
-
Karnataka: త్వరలో కాంగ్రెస్ హైకమాండ్ భేటీ.. తేల్చేయనున్న కర్ణాటక పంచాయితీ!
-
Virat Kohli: ఈ ముగ్గురు బౌలర్లను ఎదుర్కోవడం చాలా కష్టం.. నా వల్ల కాదు: విరాట్ కోహ్లీ
-
Ebola outbreak: ఎబోలా వైరస్‌పై భారత్ అప్రమత్తం.. ఇండో-ఆఫ్రికా సదస్సు రద్దు..
-
Viral: వైద్యుడి నిర్లక్ష్యానికి ప్రాణం బలి.. కుడి కిడ్నీకి బదులు ఎడమ కిడ్నీ తొలగింపు.. రూ. 2 కోట్ల పరిహారం విధించిన NCDRC..
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!