‘షేర్నీ’… మనిషి రక్తం మరిగిన పులి వేటలో… విద్యా బాలన్!
వైవిద్యానికి మారుపేరు విద్యా బాలన్. ఆమె మరోసారి వెరైటీ క్యారెక్టర్ తో మన ముందుకొచ్చేసింది. విద్యా నటించిన ‘షేర్నీ’ మూవీ ట్రైలర్ ఇప్పుడు చాలా మందిలో ఆసక్తిని రేకెత్తిస్తోంది. తన లాస్ట్ మూవీలో గణిత మేధావి శకుంతల దేవిగా మెప్పించిన విద్యా ఈసారి కంప్లీట్ కాంట్రాస్ట్ తో ఫారెస్ట్ అఫీసర్ గా మారిపోయింది. మనిషి రక్తాన్ని మరిగిన ఓ పులిని ఛేజ్ చేసే అటవీ శాఖ అధికారిణిగా ఆమె పాత్రలో ఒదిగిపోయింది. ‘షేర్నీ’ చిత్ర దర్శకుడు అమిత్ మసుర్కర్. గతంలో ‘న్యూటన్’ అనే సినిమాతో జాతీయ అవార్డ్ స్వంతం చేసుకున్నాడు. ఆయన రూపొందించిన ఈ సినిమా అమేజాన్ ప్రైమ్ ద్వారా ప్రపంచం నలుమూలల్లోని సినిమా లవ్వర్స్ ని చేరుకోగలదని విద్యా బాలన్ ఆశాభావం వక్తం చేసింది. ఈ నెల 18 నుంచీ ‘షేర్నీ’ ఆన్ లైన్ లో స్ట్రీమింగ్ అవ్వనుంది…