బాలీవుడ్ స్టార్ విద్యాబాలన్ సౌత్‌లో ఎక్కువ సినిమాలు చేయలేదు. కానీ చేసిన కొద్దిపాటి సినిమాల్లో స్ట్రాంగ్ ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. తెలుగులో ఆమె కనిపించిన తొలి కీలక పాత్ర NTR కథానాయకుడు NTR మహానాయకుడు సినిమాల్లోనే. దర్శకుడు క్రిష్ తెరకెక్కించిన బయోపిక్‌లో ఎన్టీఆర్ భార్య బసవతారకం పాత్రలో విద్యా బాలన్ నటనకు మంచి ప్రశంసలే దక్కాయి. ఆ తర్వాత తమిళంలో బాలీవుడ్ హిట్ పింక్ రీమేక్‌గా తెరకెక్కిన నెరకొండ పారవైలో అజిత్ కి భార్య పాత్రలో విద్యా బాలన్ కనిపించింది. స్క్రీన్ టైమ్ తక్కువైనా పాత్ర వెయిట్, ఎమోషనల్ స్ట్రెంగ్త్ మాత్రం చాలా స్ట్రాంగ్. హీరోకి సమానంగా కథను ముందుకు నడిపించే క్యారెక్టర్‌తో ఆమె మరోసారి తన క్లాస్ యాక్టింగ్ చూపించింది. ఇప్పటివరకు సౌత్‌లో తక్కువ సినిమాలే చేసినా… ప్రతి సినిమాలో పాత్ర బలంగా ఉండేలా చూసుకోవడమే విద్యా బాలన్ స్ట్రాటజీగా కనిపిస్తోంది.
Also Read : Dacoit Tease : కన్నెపిట్టరో.. కన్నుకొట్టరో ‘డెకాయిట్’ శేష్.. టీజర్ అదిరిందిగా
ఇక ఇప్పుడు మరో సౌత్ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సుపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో జైలర్ కు సీక్వెల్‌గా జైలర్ 2 రెడీ అవుతోంది. లేటెస్ట్ గా బాలీవుడ్ స్టార్ విద్యాబాలన్ జైలర్ 2లో కీలక పాత్రకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. స్క్రిప్ట్ నచ్చడంతోనే ఆమె ఈ ప్రాజెక్ట్ ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. కథలో మేజర్ టర్నింగ్ పాయింట్ తీసుకొచ్చే స్ట్రాంగ్, లేయర్డ్ క్యారెక్టర్‌లో విద్యాబాలన్ కనిపించనుందట. ఆమె ప్రజెన్స్ మరింత ఇంటెన్సిటీని యాడ్ చేస్తుంది. 2026 ఆగస్టు 14న గ్రాండ్ రిలీజ్ ప్లాన్ చేస్తుండటంతో జైలర్ 2పై అంచనాలు మరింత పెరిగాయి. ఎందుకంటే గతంలో జైలర్ కూడా ఆగస్టులోనే రిలీజ్ అయ్యింది. ఈ సినిమాని సన్ పిక్చర్స్ నిర్మిస్తుండగా, రజినీకాంత్ మళ్లీ తన ఐకానిక్ పాత్ర టైగర్ ముత్తువేల్ పాండియన్గా నటించనున్నాడు. పాన్-ఇండియా అప్పీల్ కోసం మోహన్ లాల్, శివరాజ్ కుమార్, మిథున్ చక్రవర్తి లాంటి స్టార్లు క్యామియో రోల్స్‌లో కనిపించనున్నారు.