Anil Ravipudi: సంక్రాంతి టార్గెట్‌గా అనిల్ రావిపూడి కొత్త సినిమా.. ముహూర్తం డేట్ అఫీషియల్‌గా ప్రకటించిన డైరెక్టర్!

Anil Ravipudi

Anil Ravipudi

Anil Ravipudi: టాలీవుడ్ ‘హిట్ మెషిన్’, సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి తన తదుపరి క్రేజీ ప్రాజెక్ట్‌ను పట్టాలెక్కించేందుకు ముహూర్తం ఖరారు చేశారు. జూన్ 18న తన కొత్త చిత్రం ఘనంగా స్టార్ట్ కానుందని దర్శకుడు స్వయంగా ప్రకటించారు. ఇటీవల జరిగిన ఒక సినిమా ఈవెంట్‌లో పాల్గొన్న అనిల్ రావిపూడి, ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కు సంబంధించిన పూజా కార్యక్రమాలు జూన్ 18న హైదరాబాద్‌లో జరగనున్నాయని వెల్లడించారు. ఆ తర్వాత కేవలం నాలుగు రోజుల గ్యాప్‌లోనే, అంటే జూన్ 22 నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుందని సమాచారం.

అనిల్ రావిపూడి గత చిత్రాలు బాక్సాఫీస్ వద్ద సంక్రాంతి సీజన్‌లో వచ్చి బ్లాక్‌బస్టర్ హిట్లుగా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అనిల్ రావిపూడి కొత్త సినిమా కూడా సంక్రాంతి టార్గెట్‌గానే తెరకెక్కుతుందని సమాచారం. ఈ చిత్రంలో విక్టరీ వెంకటేష్, నందమూరి కల్యాణ్ రామ్ హీరోలుగా నటిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ-ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ కంప్లీట్ ఫన్ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌కు సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందించనున్నారు. ఈ సినిమా స్క్రిప్ట్ విషయంలో అనిల్ రావిపూడి ఎక్కడా కాంప్రమైజ్ కాలేదని తెలుస్తోంది. తాజాగా అనిల్ రావిపూడి ఇచ్చిన షూటింగ్ అప్డే్ట్‌తో వెంకీ మామా – కల్యాణ్ రామ్ ఫ్యాన్స్ మస్త్ ఖుషీ అవుతున్నారు.

×
×
Ad