Anil Ravipudi: వెంకటేష్ కోసం మ్యారిడ్ బ్యూటీ, కళ్యాణ్ రామ్ కోసం యంగ్ బ్యూటీ?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్‌లో సంక్రాంతి సినిమాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిపోయిన సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి.. ఈ ఏడాది ‘మన శంకర వర ప్రసాద్ గారు’ చిత్రంతో భారీ విజయాన్ని అందుకున్నాడు. వచ్చే ఏడాది కూడా బాక్సాఫీస్ వద్ద తన మార్క్ చూపించేందుకు సిద్ధమవుతున్నాడు. అయితే, ఈసారి ఒక క్రేజీ మల్టీస్టారర్ ప్రాజెక్టును పట్టాలెక్కిస్తున్నాడు. విక్టరీ వెంకటేష్, నందమూరి కల్యాణ్ రామ్ ప్రధాన పాత్రల్లో భారీ చిత్రం ప్లాన్ చేస్తున్నాడు. ఈ క్రేజీ కాంబినేషన్‌పై ఇప్పటికే అధికారిక ప్రకటన వెలువడగా.. ప్రస్తుతం అనిల్ రావిపూడి తన టీమ్‌తో కలిసి స్క్రిప్ట్ వర్క్‌ను శరవేగంగా పూర్తి చేస్తున్నారు. ఈ కథలో యాక్షన్‌తో పాటు.. వినోదం, ఫ్యామిలీ ఎమోషన్స్‌కు పెద్దపీట వేస్తున్నట్లు సమాచారం. త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది.
Also Read: Kalki 2: మహాభారత పర్వం పీక్స్.. 20 ని. గూస్‌బంప్స్ అంతే!
Also Read
ఇదిలా ఉంటే.. ఈ సినిమాలో నటించబోయే కథానాయికల గురించి ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. ఇప్పటికే వెంకటేష్‌కు జోడిగా మ్యారిడ్ బ్యూటీ మహానటి కీర్తి సురేష్ ఆల్మోస్ట్ ఫైనల్ అయినట్టుగా టాక్ ఉంది. 2024లో చిన్న నాటి స్నేహితుడు ఆంటోనీ తట్టిల్‌ను పెళ్లాడిన కీర్తి.. సినిమాల పరంగాను దూసుకుపోతోంది. ఈ కొత్త జోడీ ప్రేక్షకులకు ఫ్రెష్ ఫీల్ ఇస్తుందని అభిమానులు భావిస్తున్నారు. ఇక కళ్యాణ్ రామ్‌కు జంటగా ఓ యంగ్ బ్యూటీ పేరు వినిపిస్తోంది. కల్యాణ్ రామ్ సరసన కృతి శెట్టిని ఎంచుకున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఇదే నిజమైతే.. కృతి శెట్టి కెరీర్‌కు ఇది టాలీవుడ్‌లో సెకండ్ ఇన్నింగ్ అయినట్టే. త్వరలోనే హీరోయిన్ల విషయంలో మేకర్స్ నుంచి అఫీషియల్ కన్ఫర్మేషన్ రానుంది. ఈ చిత్రాన్ని 2027 సంక్రాంతి కానుకగా విడుదల చేయడానికి ప్లాన్ చేస్తుండగా.. ఒక ఆసక్తికరమైన టైటిల్ లాక్ చేసినట్లు సమాచారం. త్వరలోనే టైటిల్ కూడా అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది.
Also Read: Jr NTR : ఎన్టీఆర్ గ్రాండ్ పార్టీ.. డ్రాగన్‌కు స్పెషల్ ట్రీట్!
తాజావార్తలు
-
Harish Rao: గోదావరి-కావేరి లింక్‌పై కుట్ర జరుగుతోంది.. మరో నీటి ఉద్యమం మొదలు పెడతాం..
-
Maharashtra: మహా దారుణం.. వివాహితపై భర్త స్నేహితులు గ్యాంగ్‌రేప్
-
Delhi-Tihar Jail: తీహార్ జైలులో సీజేపీ నేతలకు స్పెషల్ ట్రీట్మెంట్..
-
LK Advani Health Update: ఐసీయూలో మాజీ ఉప ప్రధాని లాల్ కృష్ణ అద్వానీ.. హెల్త్ బులెటిన్ విడుదల..
-
Janasena First List: 2 కార్పొరేషన్లు, 12 మున్సిపాలిటీలకు జనసేన అభ్యర్థులు ఖరారు.. తొలి జాబితా పూర్తి వివరాలు ఇవే
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: గంభీర్ ఎంత పనిచేస్తున్నావయ్యా..! టీమ్‌లో ఛాన్స్‌పై వైభవ్ ఆశలు.. ‘స్టిల్ బిలీవింగ్’ అంటూ.!
-
Wasim Jaffer: టీమిండియా మాజీ ఓపెనర్ కీలక నిర్ణయం.. చీఫ్ సెలెక్టర్ పదవికి దరఖాస్తు..!
-
Chaminda Vaas: ఐపీఎల్లో తొలిసారి కోచ్‌గా శ్రీలంక దిగ్గజం.. ఢిల్లీ క్యాపిటల్స్ కీలక బాధ్యతలు అప్పగింత..!
-
Kavya Maran – Anirudh Ravichander పెళ్లి ఫిక్స్.! గ్రీస్‌లో పెళ్లి, చెన్నైలో గ్రాండ్ రిసెప్షన్.?
-
Yoo Ji-won: ఫినిషింగ్ లైన్‌కు 500 మీటర్ల దూరంలో కుప్పకూలిన రన్నింగ్ ఇన్ఫ్లుయెన్సర్.. 25 ఏళ్లకే మృతి..!