Kalki 2: మహాభారత పర్వం పీక్స్.. 20 ని. గూస్‌బంప్స్ అంతే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వచ్చిన ‘కల్కి 2898 AD’ బాక్సాఫీస్ వద్ద సృష్టించిన ప్రభంజనం అంతా ఇంతా కాదు. ఈ సినిమా ముగింపులో పార్ట్-2 పై ఇచ్చిన లీడ్స్ ప్రేక్షకుల్లో గూస్‌బంప్స్ తెప్పించాయి. ముఖ్యంగా మహాభారతానికి సంబంధించి స్టార్టింగ్, ఎండింగ్ సీక్వెన్స్‌కు థియేటర్లు దద్దరిల్లిపోయాయి. కాకపోతే.. చాలా తక్కువ నిడివితో ఈ సీక్వెన్స్‌లు ఉంటాయి. ఆ సీన్స్ ఇంకా ఉంటే బాగుండు అని సదరు ప్రేక్షకులు భావించారు. అయితే, ఇప్పుడు కల్కి2లో మాత్రం మహాభారతం ఎపిసోడ్ పీక్స్‌లో ఉంటుందని తెలుస్తోంది. అది కూడా ఏకంగా 20 నిమిషాల పాటు ఉంటుందని సమాచారం.
Also Read: Jr NTR : ఎన్టీఆర్ గ్రాండ్ పార్టీ.. డ్రాగన్‌కు స్పెషల్ ట్రీట్!
Also Read
- Faria: నేనింకా ఇల్లు కొనలేదు.. సందీప్ కిషన్ చెప్పాక కొనాలనుకున్నా.!
- Hanuman Ansh : రూ. 400 కోట్ల దిశగా హనుమాన్ అంశ్ 47వ రోజు దాదాపు రూ. 5 కోట్లు వసూళ్లు
- Sanjay Leela Bhansali : రణబీర్ కపూర్ 'లవ్ అండ్ వార్' ఫస్ట్ లుక్ రిలీజ్
- Hashmi - Himesh : 20 ఏళ్ల తర్వాత ఇమ్రాన్ హష్మీ, హిమేష్ రేష్మియా రీ యూనియన్
మొదటి భాగంలో కేవలం కొన్ని నిమిషాల పాటు కనిపించిన కురుక్షేత్ర యుద్ధ ఘట్టాలు, రెండో భాగంలో 20 నిమిషాలంటే.. సినిమా ఎలా ఉండబోతుందో ఊహించుకోవచ్చు. అశ్వత్థామ శాపం, కర్ణుడి వీరత్వం, కృష్ణుడి వ్యూహాలు.. ఇలా ప్రతిదీ పీక్స్‌లో ఉండబోతోందని టాక్. ముఖ్యంగా పురాణాలను సైన్స్ ఫిక్షన్‌తో జోడించిన తీరు భారతీయ సినీ చరిత్రలోనే ఒక సరికొత్త ప్రయోగంగా ఉంటుందని అంటున్నారు. ఈ 20 నిమిషాల ఎపిసోడ్ థియేటర్లలో ప్రేక్షకులకు ఒక సరికొత్త అనుభూతిని ఇస్తుందని, బాక్సాఫీస్ రికార్డులను తిరగరాయడం ఖాయమని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. దర్శకుడు నాగ్ అశ్విన్ తన విజువల్ వండర్‌తో కేవలం తెలుగు సినిమానే కాదు, ఇండియన్ సినిమా స్టాండర్డ్స్‌ను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లేలా ప్లాన్ చేస్తున్నారు. పార్ట్-1 కేవలం పరిచయం మాత్రమే అయితే, పార్ట్-2లో అసలైన యుద్ధం చూపించబోతున్నాడు. ఇప్పటికే షూటింగ్ మొదలు కాగా కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్‌లపై కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. త్వరలోనే ప్రభాస్ కూడా కల్కి సెట్స్‌లో జాయిన్ అవనున్నాడు. అన్నీ అనుకున్నట్టుగా జరిగితే, వచ్చే ఏడాదిలో కల్కి 2 రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నారు.
తాజావార్తలు
-
CJP: 48 గంటల్లో రాజీనామా చేయాలి.. జ్ఞానేశ్ కుమార్‌కు CJP అల్టిమేటం..
-
Iran-US: ఇరాన్ తాజా వార్నింగ్.. మళ్లీ దాడి చేస్తే యుద్ధం హిందూ మహాసముద్రం దాకా విస్తరిస్తుందని హెచ్చరిక
-
Padi Kaushik Reddy : దానం అనర్హతపై సుప్రీం తీర్పు.. కౌశిక్ రెడ్డి హర్షం.!
-
Nadendla Manohar: డీఎస్సీపై అవకతవకలు జరిగితే అసెంబ్లీ ధైర్యంగా మాట్లాడండి..
-
Stock Market Crash: 1200 పాయింట్లు కుప్పకూలిన సెన్సెక్స్.. భారీ పతనానికి 3 ప్రధాన కారణాలు ఇవే!
ట్రెండింగ్
-
Asian Games 2026లో భారత్ షెడ్యూల్ ఇదే.. పాకిస్థాన్‌తో మ్యాచ్ ఎప్పుడంటే?
-
144Hz డిస్‌ప్లే, 11,000mAh బ్యాటరీతో కొత్త ట్యాబ్లెట్లు Xiaomi Pad 9, Pad 9 Pro లాంచ్..!
-
Mushroom Pulao: నాన్‌వెజ్‌ను తలపించే రుచితో హెల్తీ & టేస్టీ రెస్టారెంట్ స్టైల్ ‘మష్రూమ్ పులావ్’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.!
-
150+ స్పోర్ట్స్ మోడ్లు, 21 రోజుల బ్యాటరీతో Xiaomi Watch S5, Smart Band 11 లాంచ్.. ధర, ఫీచర్స్ ఇవే.!
-
100W ఫాస్ట్ ఛార్జింగ్, 200MP కెమెరా, 120Hz LTPO డిస్ప్లేతో Xiaomi 18 Pro లాంచ్.!