ఈ ఏడాది విక్టరీ వెంకటేష్ ఒక అద్భుతమైన హిట్ అందుకున్న సంగతి తెలిసిందే. అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేష్ హీరోగా నటించిన సంక్రాంతికి వస్తున్నాం చిత్రం ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రీజనల్ సినిమాలలో 33 కోట్లు కలెక్ట్ చేసి ఈ సినిమా సరికొత్త రికార్డులు సెట్ చేసింది. ప్రస్తుతానికి సినిమా ఓటీటీలో కూడా అదే జోష్ చూపిస్తూ దూసుకుపోతోంది. అయితే ఈ సినిమా తర్వాత వెంకటేష్ ఎలాంటి సినిమా చేస్తాడా? అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్న తరుణంలో ఆయన తరువాత సినిమాకి సంబంధించిన అప్డేట్ ఒకటి వెలుగులోకి వచ్చింది. నిజానికి సినిమా రిలీజ్ అయిన తర్వాత కొద్ది రోజుల నుంచి సినిమా స్క్రిప్స్ వినడం మొదలుపెట్టాడు విక్టరీ వెంకటేష్. అయితే దాదాపు 20 సినిమా కథలు రిజెక్ట్ చేసిన తర్వాత ఏజెంట్ సినిమాతో డిజాస్టర్ ఇచ్చిన సురేందర్ రెడ్డి కథను వెంకటేష్ ఓకే చేసినట్లుగా తెలుస్తోంది.
Sankranthi 2026: ఇప్పటి నుంచే కర్చీఫులు వేస్తున్నారయ్యో!!
గత కొంతకాలంగా సినీ నిర్మాణానికి దూరంగా ఉంటున్న ఒకప్పటి టాప్ ప్రొడ్యూసర్ నల్లమలపు బుజ్జి ఈ సినిమాతో మళ్ళీ రీ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. నిజానికి వెంకటేష్ ఈ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని ఒకపక్క ప్రచారం జరుగుతుండగా ఇవ్వలేదని మరోపక్క ప్రచారం జరుగుతోంది. వెంకటేష్ కోసం చాలామంది దర్శకులు కథలు రాసుకున్నారు. మరి కొంతమంది తమ దగ్గర ఉన్న కథలతో ఆయనని సంప్రదించారు. కిషోర్ తిరుమల, కొరటాల శివ, సురేందర్ రెడ్డి, మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ కాంపౌండ్ నుంచి మరో యంగ్ డైరెక్టర్. ఇలా చాలా మంది ఆయనను కలిసి కథలు చెప్పారు. కొంతమంది తామే దర్శకత్వం చేస్తామని చెబితే కొంతమంది కథ ఇస్తామని చెప్పారు. వీటిలో దాదాపుగా సురేందర్ రెడ్డి కదా ఫైనల్ అయినట్లుగానే ప్రచారం జరుగుతుంది. అయితే 20 కథలు రిజెక్ట్ చేసిన తర్వాత సురేందర్ రెడ్డి చెప్పిన కథలో ఏముందా అని వెంకటేష్ ఫ్యాన్స్ అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.