VarunLav: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ – లావణ్య త్రిపాఠి.. నవంబర్ 1 న భార్యాభర్తలుగా మారారు. ఇటలీలో వీరి పెళ్లి ఘనంగా జరిగింది. డెస్టినేషన్ వెడ్డింగ్ కావడం వలన ఇండస్ట్రీని మెగా కుటుంబం పిలవలేకపోయింది. దీంతో ఇటలీ నుంచి తిరిగి వచ్చిన మెగా కుటుంబం.. టాలీవుడ్ ఇండస్ట్రీ మొత్తాన్ని పిలిచి రిసెప్షన్ ఎరేంజ్ చేశారు. నేడు ఈ వేడుక మాదాపూర్‌లోని ఎన్ కన్వెన్షన్ హాల్ లో గ్రాండ్ గా జరుగుతోంది. ఈవేడుకకు పలువురు ప్రముఖులతో పాటు టాలీవుడ్ సెలబ్రిటీలు అంతా విచ్చేశారు. సునీల్, నాగచైతన్య, పురందేశ్వరి,టాలీవుడ్ నిర్మాతలు సహా తదితురులు రిసెప్షన్‌కు హాజరవగా అందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇక ఈ రిసెప్షన్ లో హైలైట్ అంటే.. నవ దంపతులే అని చెప్పాలి.
Dil Raju: దిల్ రాజు సొంత ఓటిటీ.. అసలు నిజం ఏంటి ..?
బ్లాక్ కలర్ పై గోల్డ్ కలర్ ఫ్లోరల్ వర్క్ షేర్వాణీలో వరుణ్ తేజ్.. గోల్డ్ కలర్ డిజైనర్ డ్రెస్ లో లావణ్య కనిపించారు. ముఖ్యంగా లావణ్య చీరకట్టు.. మెడలో రవ్వలహారం.. ఇక వరుణ్ కట్టిన పసుపుతాడు, నుదుటన కుంకుమతో అచ్చ తెలుగు ఆడపడుచులా కనిపించింది. దీంతో మెగా కోడలిని మెగా ఫ్యాన్స్ ప్రశంసిస్తున్నారు. సాధారణంగా సెలబ్రిటీస్.. పెళ్ళికి చీర కట్టుకున్నా.. రిసెప్షన్ కు డిజైనర్ డ్రెస్ లతో కనిపిస్తారు. అందుకు విరుద్ధంగా లావణ్య నిండైన చీరకట్టుతో కనిపించేసరికి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. మెగా కోడలు ఇప్పటినుంచే మెగా కుటుంబంపై విమర్శలు రాకుండా చూసుకుంటుందని కామెంట్స్ పెడుతున్నారు.